#


Index

శ్రీ విష్ణు సహస్రనామ అంతరార్థము
నామం అంతరార్థము
భూతాత్మా
భూతభావనః
వ్యాపించటమంటే దేశకాల వస్తువులనేవి మూడూ దానికి భిన్నంగా ఉండి అది వీటిని వ్యాపించిందని కాదు. సమస్త భూతాలకూ అది ఆత్మ. అంటే స్వరూపం. ఆభరణాలకు బంగారం లాగా. బంగారాని కాభరణాలు వేరుగా లేనట్టే విష్ణుతత్వానికి భిన్నంగా దేశకాలాదులు లేవు. అంటే అపరిచ్ఛిన్నమైన పరమాత్మ చైతన్యమే దేశకాల వస్తువులనే పరిచ్ఛేదత్రయంగా (Three Dimensions) భాసిస్తూ ఉందని తాత్పర్యం. భూత భావనః అంటే ఇదే అర్థం. భూతరూపేణ ఆత్మానమ్ భావయతి కల్పయతీతి
పూతాత్మా
పరమాత్మాచ
అలా భూత సృష్టి చేస్తూ పోతే వాటి మూలంగా అది కలుషితం కాదా అని మరలా శంకించరాదు. అది పూతాత్మ, పరిశుద్ధమైన స్వరూపం. చైతన్యమనేది నిరాకారం గనుక దానినేదీ అంటదు. సృష్టి చేస్తున్నా పరిశుద్ధమే. ఆకాశం ఎంత వర్షం కురుస్తున్నా తడుస్తుందా. అలాగే పరమాత్మ కూడా, పరమమైన ఆత్మ అది భూత సంపర్కం లేనిదని అర్థం. అలాంటి సంపర్క మున్నది మనబోటి జీవాత్మ.
ముక్తానాం
పరమా గతిః
జీవాత్మకూడా వస్తుతః పరమాత్మ స్వరూపుడే. దేహేంద్రియాదులే నేనని తాదాత్మ్యం చెందటం మూలాన బద్ధుడయి కనపడు తున్నాడు. వీటినుంచి ముక్తుడైతే చాలు. అలాంటి ముక్త జీవులందరికీ పరమమైన గతి - పోయి చేరవలసిన స్థానమదే.
అవ్యయః
పురుషః సాక్షి
పరమమైనది గనుకనే వ్యయం లేనిదది, మార్పు చెందదు. కారణం పూర్ణమైన పదార్థం. చలించటానికి లేదు. చలించ కుంటే ఎలా మారుతుంది. చలనం లేని దాకాశంకూడా ఉంది. గదా అంటే అది ఆకాశానికి కూడా సాక్షి. చైతన్యం గనుక జడమైన ఆకాశాదులన్నింటినీ గమనించగలదది.

Page 8

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు