నామం | అంతరార్థము |
---|---|
అశ్వత్థః | నిత్యమూ చలిస్తూ పోయే ఈ కాలమనే అశ్వాన్ని స్థ - అధిష్ఠించి కూచున్నది. |
చాణూరాంధ్ర నిషూదనః |
(చాణూర) శోకాన్నీ (ఆంధ్ర) అంధత్వాన్ని ఆపాదించే మోహాన్నీ రెండింటినీ నిర్మూలించేది. |
సహస్రార్చిః సప్తజిహ్వః సప్తవాహనః |
ఇంకా ఎలాంటిదా చైతన్యదీప్తి. సహస్ర గుణంగా ప్రజ్వలిస్తున్నది. భూత పంచ మహదహంకారాలనే సప్తజ్వాలలతో ప్రసరిస్తున్నది. శబ్ద స్పర్శాదులూ మనన ధారణలనే సప్త సమిధల నాహుతి చేసుకొనేది. సప్తేంద్రియాలనే వాహనాలతో అటూ ఇటూ తిరుగుతున్నది. |
అమూర్తిః అనఘః అచింత్యః భయకృత్ భయనాశనః |
శుద్ధ చైతన్యమే గనుక అమూర్తమా స్వరూపం. అందుకే ఏదీ అంటనిదది. మనసుతో చింతించినా అదీ దానినంటదు. దేని అంటు సొంటు లేకుండానే అన్ని భయాలూ మనకంట జేస్తుంది. మనమూ సాధకులమై అంటకుండా మెలగితే భయాన్ని తొలగిస్తుంది. |
అణుః బృహత్ కృశః స్థూలః |
దాని గొప్ప తన మెలాటిదంటే అదే అణువు. అదే మహత్. అదే సన్నం - అదేలావు. |
గుణభృత్ నిర్గుణః మహాన్ |
గుణాలన్నీ ఉన్నదీ అదే - ఏ గుణమూ లేనిదీఅదే. వీటితో లావాదేవీ పెట్టుకొని కూడా ఏ సంసర్గమూ లేక వీటికతీతంగా మెలగేదీ అదే. |
అధృతః స్వధృతః |
ఇలాంటి తత్త్వం గనుకనే అది దేనిచేతా ధరింపబడదు. ໖. (Self Contained) |
Page 58