#


Index

శ్రీ విష్ణు సహస్రనామ అంతరార్థము
నామం అంతరార్థము
కుముదః
కుందరః
కుందః
(కు) తనకు విలోమంగా ఏర్పడ్డ సృష్టిని చూచి ఆనందిస్తాడు. దాన్ని మరలా (దర) విదారణం చేసి తనలో కలుపుకొంటాడు. అలా కలుపుకోమనే మనకది (ద) ప్రసాదిస్తున్నాడు.
పర్జన్యః
పావనః
అనిలః
పరిపరిదేహాలలో జీవులుగా జన్మిస్తూ వారిని సాధకులుగా మార్చి పరిశుద్ధులను చేస్తూ అసలేదీ చేయకుండా అచలస్థితిలో (అన్+ఇల) ఉన్నాడు.
అమృతాశః
అమృతవపుః
సర్వజ్ఞః
సర్వతోముఖః
ఒక అశనముందాయనకు, దానితో పెరిగే శరీరముంది. అశనం ప్రపంచం. శరీరం చైతన్యం, అయితే మృతంకావు రెండూ-ఎప్పటికీ అమృతమే. అసలీ అశనాదులన్నీ గ్రహిస్తున్న దదే. సర్వతో ముఖమైనదా జ్ఞానం. జ్ఞాతా, జ్ఞానం, జ్ఞేయం మూడూ అదే.
సులభః
సువ్రతః
సిద్ధః
మూడూ అదే గనుక సుళువుగా లభిస్తుంది. కాని దృఢమైన దీక్ష ఉండాలి మనకు. అలాంటి చూపున్న వాడికది సిద్ధమే క్రొత్తగా సాధించవలసింది కాదు.
శత్రుజిత్
శత్రుతాపనః
సిద్ధుడైన మానవుడికిక సంసారమనే శత్రువు వల్ల బాధలేదు. దాన్ని జయించగలడు. దానివల్ల తాను తపించటం కాదు. దాన్నే తపింప చేయగలడు.
న్యగ్రోధోదుంబరః (న్యక్+రోధ) ప్రతి ఒక్క నిరోధాన్ని క్రిందుపరచి (ఉత్+ఉంబర) అద్భుతంగా పైకి లేచిన తత్త్వమది. అంబరంలాగా స్వచ్ఛమూ నిర్లిప్తమైనది.

Page 57

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు