నామం | అంతరార్థము |
---|---|
సుందః | చలించి నామ రూపాలుగా పరిణమిస్తేనే సుందరుడాయన, వాటికి (సుం) సౌష్ఠవాన్ని (ద) ఇస్తున్నవాడు మరలా తానే. |
రత్ననాభః సులోచనః |
విలువైన ఆ గుణరత్నాలన్నీ ఆయనలోనే గుప్తమయి ఉన్నాయి. ఆయన చూపులోనే అవి వెలువడుతున్నాయి. |
అర్కః వాజసనః శృంగీ |
అలా వెలువడిన నామరూపాది గుణాలద్వారానే మన మర్చించ వలసిన తత్త్వమది. అర్చిస్తే ప్రసన్నుడయి (వాజ) బలాన్ని (సన) అనుగ్రహిస్తాడు సాధకుడికి (శృణాతీతి శృంగీ) చీల్చి వేస్తాడు కూడా తాపత్రయాన్ని. |
జయంతః సర్వవిత్ జయీ సువర్ణ బిందుః |
అదే సాధకుడైన వాడికి జయం. సర్వమ్ విష్ణుమయమని దర్శించటమే జయం. సువర్ణం ఓకారం, బిందువు మకారం, రెండూ కలిస్తే ఓమ్. ఓంకార రూపుడు పరమాత్మ. వాచకమూ వాచ్యమూ కూడా. సువర్ణములంటే నామరూపాలు బిందువంటే శూన్యం. నామరూపాలూ పరమాత్మే తద్రహితుడూ ఆయనేనని భావం. |
అక్షోభ్యః | ఎంత సగుణుడైనా గుణక్షోభం చేత మరలా క్షుబ్ధుడు కాడు. |
సర్వవాగీశ్వరేశ్వరః | కారణం వాచకమైన ఈ గుణ సృష్టికంతటికీ అధీశుడు వైఖరి నుంచి పరా వరకున్న వాక్కులన్నిటికీ అతీతుడు. |
మహాహ్రదః | ప్రతిభావమూ దానినుంచే రావాలి కాబట్టి అది చాలా లోతైనది. |
మహాగర్తః | ఒక పెద్ద అఖాతమది. దిగలేము. అందుకోలేము. |
మహాభూతః మహానిధిః |
భూతం కాదది ఇది ఇంత అని నిర్ణయించటానికి. మహాభూతం మహానిధి కూడా. అన్నీ అందులోనే నిహితమయి ఉన్నాయి. |
Page 56