నామం | అంతరార్థము |
---|---|
వత్సరః వత్సలః వత్స |
అన్ని రూపాలూ కర్మలూ అందులోనే వసిస్తున్నాయి. అన్నీ తనవే గనుక అందరికీ వత్సలుడాయన. అవిగాదు తనలో వసించటం. అసలు తనలో తానే (వత్సీ) వసిస్తున్నాడు. |
రత్నగర్భః ధనేశ్వరః |
అంతా స్వరూపమే కాబట్టి ప్రతి ఒక్కటీ విలువైన రత్నమే. అది ఆ చైతన్య గర్భంలోనే ఉంది. అమూల్యమైన ఆ ధనానికంతా అధిపతి అదే. |
ధర్మగుప్ ధర్మకృత్ ధర్మీ |
ఇంతకూ ధర్మమని నీవు భావించే దానినంతటినీ తనలో గుప్తం చేసుకుంటాడు. తానే దానిని బయట పెడుతూ అది ఏదో గాదు మరలా తన స్వరూపమే (ధర్మ) నని చాటుతుంటాడు. ధర్మి నీవూ నేనూ కాదు. పరమాత్మ. |
సత్ అసత్ క్షరమ్ అక్షరమ్ |
అసలు దానికి వేరుగా ఏదీలేదు. ఉన్నదంతా అదే (సత్) లేనిదంతా కూడా అదే (అసత్) రజ్జుసర్పాలు రెండూ అదే. అంతేకాదు. ఆభాస రూపంగా ఎప్పటికప్పుడు (క్షర) నశించేది అదే. వస్తురూపంగా (అక్షర) ఎప్పటికీ నశించనిదీ అదే. |
అవిజ్ఞాతా సహస్రాంశుః |
వివిధంగా విశేషంగా చూచే జ్ఞాత జీవుడు. ఇలాంటి జ్ఞాతకా డాయన సర్వజ్ఞుడు. తన చైతన్య మండలంనుంచి వెలువడిన సహస్రాంశువులే ఈ నామరూపాలు. |
విధాతా కృత లక్షణః |
వివిధ రూపాలుగా వీటిని తీర్చిదిద్ది - ప్రత్యేకంగా వీటికాయా లక్షణాలను కల్పించి వీటికి నియామకుడయి ఉన్నాడు. |
గభస్తినేమిః సత్త్వస్థః సింహః |
నామరూపాలనే ఈ దీప్తి కిరణాల కన్నింటికీనేమి -కేంద్రమది. కిరణచక్రమది. తన సత్త్వంలో తానుంటూ మరలా సత్త్వశుద్ధి మూలంగా భాసిస్తుంది. దానికి ప్రతిద్వంద్వి అయిన |
Page 39