#


Index

శ్రీ విష్ణు సహస్రనామ అంతరార్థము
నామం అంతరార్థము
భూతమహేశ్వరః రజస్తమస్సులను సింహంలాగా హింసిస్తుంది. అప్పుడే సమస్త భూతాలకూ మహేశ్వరుడనిపించుకొంటాడు మానవుడు.
ఆదిదేవః
మహాదేవః
దేవేశః
దేవభృద్గురుః
దేవతలూ కొంత కొంత అధీశులే భూతజాతానికి, వారికి కూడా ఆది దేవుడు పరమాత్మ. మహాదేవ. అంతకన్నా పరిపూర్ణమైన దాయన దీప్తి. దేవతల దీప్తి శకలాలకన్నింటికీ అధీశ్వరమైన దీప్తి. దీప్తి కలిగిన వాటన్నింటికీ దీప్తి నొసగిన గురువది.
ఉత్తరః
గోపతిః
గోప్తా
నీవెంత గురువని చెప్పినా అంతకన్నా (ఉత్తర) గొప్ప గురువా పరమాత్మ, గో అంటే జ్ఞానం. సమస్త జ్ఞానాలకూ పతి అతీతమైన జ్ఞానమది. ప్రజ్ఞానం బ్రహ్మ. దానినెప్పుడూ గోప్యంగా ఉంచుతాడు. బయటపెట్టడు.
జ్ఞానగమ్యః
పురాతనః
జ్ఞానమంటే ఇక్కడ బ్రహ్మజ్ఞానం. ఒక్క బ్రహ్మాకార వృత్తిచేతనే దాని నందుకోవలసి ఉంది. క్రొత్తగా ఏర్పడేది కాదు మరలా. అందుకోక పూర్వమే ఉందది. కేవల మావరణ భంగమే అందుకోవటం.
శరీరభూతభృత్
భోక్తా కపీంద్రః
భూరిదక్షిణః
పురాతనమైన ఆ చైతన్యమే ఒక వ్యష్టి శరీరాన్ని - సమష్టి శరీరాన్ని రెంటినీ ధరించింది. రెండూ పంచభూతాత్మకమే. రెండింటి లోనూ చేరి శబ్దాది విషయాలను భుజించే భోక్త కూడా తానే. కమ్ పిబ తీతి కపి, సూర్యుడు. అంటే బుద్ధి. దీనికింద్రుడు సాక్షిగా ఉన్నది తానే. ఆ సాక్షిని నీ బుద్ధి పట్టుకోవాలంటే భూరి ఈ ఉపాధి వర్గాన్నంతా (దక్షిణ) త్యాగం చేయాలి. త్యాగేనైకే అమృతత్వమానశుః

Page 40

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు