#


Index

శ్రీ విష్ణు సహస్రనామ అంతరార్థము
నామం అంతరార్థము
అనిరుద్ధః
గోవిందః
గోవిదాం పతిః
అనిరుద్ధ మా తత్త్వం. ఏదీ నిరోధించలేదు దాన్ని. అది సురానందః లయమూ (నిరోధ) కాదు. ఆత్మారాముల (సురలు) కానంద రూపం. స్వయంగా రాజిల్లే (సుర) ఆనందమది. గో-జ్ఞానం చేతనే వింద అందుకోవలసిందా ఆనందం, అందుకే గో ఈ శరీరాలలోకి వచ్చిందది. శరీరధారులందరినీ సాధకులుగా మార్చి కాపాడేదది (పతి)
మరీచిః
దమనః
హంసః
చైతన్యజ్యోతి (మరీచి) అది. మరుమరీచి (ఎండమావులు) లాంటి సంసారమనే ఛాయను సృష్టించింది. దమన-కాల రూపంగా మరలా దాన్ని దమిస్తున్నది. ప్రాణ (హంస) రూపంగా అంతరజగత్తును కూడా నడుపుతున్నది.
సుపర్ణః
భుజగోత్తమః
రెండు మంచి పర్ణాలు రెక్కలు అంటే ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాల రూపంతో రాకపోకలు చేస్తుంటుంది. భుజగోత్తమ అంటే కుండలినీ-శక్తిరూపంగా లోపల జేరి శరీరాన్ని ధారణ చేస్తున్నది.
హిరణ్యనాభః
సుతపాః
రెండింటికీ నాభి కేంద్రస్థానం ఆ హిరణ్యమే. అంటే చైతన్య దీప్తి. సుతపాః తపస్సంటే జ్ఞానం. చాలా సమీచీనమైన జ్ఞానమది.
పద్మనాభః
ప్రజాపతిః
తపస్సు చేసిందది. అంటే ఆలోచన చేసింది. చేసి ఈ అండ పిండాదులైన పద్మాలనన్నింటినీ సృష్టించింది. ప్రజ అంటే జీవకోటి. జరాయుజాదులైన ఈ జీవులందరికీ పతి. జీవనాధారమయింది.
అమృత్యుః
సర్వదృక్
అదిమర్త్యం కాదు. మర్త్య మీ సర్వమే. సర్వమూ మర్త్యమైతే దృశ్యమైన ఈ సర్వాన్నీ దర్శిస్తున్న దృక్కది.

Page 22

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు