నామం | అంతరార్థము |
---|---|
సింహః సంధాతా |
సింహం : హింసించే దేదో అది సింహం. సర్వ దృశ్య ప్రపంచాన్నీ నిర్మూలించి నిష్ర్పంచమైన స్థితిని ప్రసాదిస్తుంది సాధకుడికి. సంధాతా అంటే అలా సమకూర్చేవాడనే అర్థం. |
సంధిమాన్ స్థిరః |
అలా సంధించే గుణమందులో సహజంగానే ఉంది. సంధించినా సంధించకున్నా రెండు దశలలోనూ అది స్థిరమే. |
అజః దుర్మర్షణః శాస్తా |
వస్తుతః అది అజం. జీవజగద్రూపంగా ఎప్పుడూ జన్మించలేదు. అయితే ఈ రహస్యం గ్రహిస్తేనే సహిస్తాడు. లేకుంటే సహించడు. సహించడు. దుర్మర్షణుడు. శాస్తా - సద్గురు రూపంగా అవతరించి ఆ మార్గం మనకు శాసించి చెబుతాడు. |
విశ్రుతాత్మా సురారిహా |
విశేషంగా శ్రవణం చేసిన వారికాత్మగా భాసిస్తాడు. అలా శ్రవణం చేయని అసురసంపద గల నాస్తికుల నంత మొందిస్తాడు. మాటి మాటికీ జనన మరణాదులను కల్పించటమే అంతమొందించటం. |
గురుః గురుతమః ధామ |
సాధకులకు గురువాయనే, గురుతముడు కూడా. పరమాత్మను మించిన గురువెవడున్నాడు. మిగతా గురువులంతా లోకాన్నే చూపితే ఈ జగద్గురువు మనకు పరమ తత్త్వాన్నే అనుగ్రహిస్తాడు. అది ఏదోగాదు. పరంధామం. అన్నిటికన్నా కడపటిదైన స్థానం. |
సత్యః సత్య పరాక్రమః |
సత్ అమృతం త మర్త్యం ఈ రెండు భావాలనూ యమిస్తున్నది య, అని ఛాందోగ్యం చెబుతున్నది. అప్పటికి మూర్తామూర్తాలు రెండూ పరమాత్మలోనే ఉన్నాయి. అదే ఈ ద్వంద్వాలను శాసిస్తున్నది. సత్యమంటే అది సచ్ఛత్యచ్చా భవత్ అంటున్న దుపనిషత్తు. ఉన్నదీ లేనిదీ రెండూ అదే. అదికూడా అర్థమే సత్యమనే మాటకు. సత్యంలో నుంచి వచ్చింది గనుక ప్రపంచం కూడా సత్యమే. దానికీ సత్యం పరంగా కనిపిస్తున్నా దీనినాక్రమించే ఉందది. సత్యపరంగానే ఆక్రమ పయనిస్తుంటుందది. కనుక ఎప్పుడూ సత్యపరాక్రమమే. |
Page 23