#


Index

శ్రీ విష్ణు సహస్రనామ అంతరార్థము
నామం అంతరార్థము
వరారోహః
మహాతపాః
శ్రేష్ఠమైన ఆరోహణమది సాధకులకు. అది కూడా గొప్ప తపస్సు. ఆలోచన చేసి ఆరోహించవలసిన స్థానం. అది అసలు తపస్స్వరూపం - యస్యజ్ఞానమయం తపః
సర్వగః
సర్వవిద్భానుః
ప్రజ్ఞానం గనుక అది సర్వగతం అంతటా వ్యాపిస్తుంది. సర్వవిద్ అన్నిటినీ గ్రహిస్తుంది. భాను-తాను భాసిస్తుంది. అన్నిటినీ భాసింపజేస్తుంది.
విష్వక్సేనః
జనార్దనః
చరాచరజగత్తంతా దాని సైన్యమే. విశ్వక్-అంతటా అదే. అందుకే జనులందరూ అర్ధన కోరవలసిందేదో గాదు. అదే.
వేదః
వేదవిద్
అవ్యంగః
వేదమంటే జ్ఞానం. జ్ఞానమూ అదే, వేదవిద్, జ్ఞానాన్ని గ్రహించే జ్ఞాతా అదే. అవి+అంగ, విశేషించి ఏ శరీరంతోనూ సాంగత్యం లేదు దానికి.
వేదాంగః ఉంటే దానికొక్కటే శరీరం - అది జ్ఞానమే.
వేదవిత్
కవిః
ఈ వేదం - ఈ జ్ఞానం చేతనే వింద్- అందుకోవాలి దాన్ని, అది కవి. క్రాంతదర్శి. దీనికతీతంగా ఉండి దీన్ని గమనిస్తున్నది.
లోకాధ్యక్షః
సురాధ్యక్షః
ధర్మాధ్యక్షః
కృతాకృతః
లోకులందరినీ చూస్తున్నది. విశేషంగా సాధకులను (సుర) గమనిస్తున్నది, వారు చేసే ధర్మకార్యాలూ దర్శిస్తున్నది. కృతా కృత. ఎవరు చేశారా చేయలేదా చేస్తే ఎంతవరకు చేశారా-ఇదీ కనిపెట్టి చూస్తేనే ఉన్నది.
చతురాత్మా
చతుర్వ్యూహః
చతుర్దంష్ట్రః
చతుర్భుజః
బ్రహ్మ-విష్ణు-రుద్ర-ఈశ్వర అని నాలుగు రూపాలు. వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ అని నాలుగు వ్యూహాలు-పరా పశ్యంతీ మధ్యమా వైఖరులనే నాలుగు దంష్ట్రలలాటి శక్తి ప్రసారాలూ - ధర్మజ్ఞాన వైరాగ్యైశ్వర్యాలనే నాలుగు సిద్ధులూ గల విశ్వరూపుడా పరమాత్మ.

Page 18

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు