నామం | అంతరార్థము |
---|---|
అమోఘః పుండరీకాక్షః |
మాతో కలిసి ఉన్నా మా ఓఘం (మోఘం) ఈ సంసార ప్రవాహం దానిమీద పనిచేయదు. అది అమోఘం. ఇది ఉందని చూచే మానవుడి హృదయపుండరీకం కేంద్రంగా చేసుకొని అన్నీ దర్శిస్తున్న |
వృషకర్మా వృషాకృతిః |
(అక్ష) దది. ఏమిటా అన్నీ. మనం చేసే పుణ్యకర్మలు. వృషమంటే పుణ్యం, ధర్మం. అసలది వృషాకృతి- ధర్మస్వరూపం. |
రుద్రః బహుశిరాః బభ్రుః |
ధర్మం మనచేత చేయిస్తున్నది కూడా అదే. ప్రాణరూపంగా మనలో చేరి అన్ని పనులూ చేస్తున్నది. రుద్రమంటే రోదించే లేదా ధ్వనించే ప్రాణస్పందం, బహుశిరాః బహుముఖాలుగా రక్తంలో చేరి ప్రసరిస్తున్నదది, మరలా ఈ బహు వ్యాపారాల నన్నిటినీ రాత్రి కాలంలో ప్రళయకాలంలో తనలోనే భరిస్తున్నది. బభ్రు. |
విశ్వయోనిః | విశ్వానికంతా యోని ఉత్పాదకమది. మరలా దానికీ విశ్వమే యోని. సాధించి పట్టుకోవలసిన ప్రమాణం. |
శుచిశ్రవాః | అయితే పట్టుకోటానికి శుచి అయిన శ్రవస్సు అంటే పరిశుద్ధమైన జ్ఞానమలవడాలి మనకు. జ్ఞానంతోనే జ్ఞానాన్ని పట్టుకోవాలి. భగవంతుడు జ్ఞానస్వరూపుడు. అది శుద్ధమైన కేవల జ్ఞానం. మన జ్ఞానమూ అలాంటిదే అయితే అందుకోగలదు. అదే బ్రహ్మాకారవృత్తి. |
అమృతః శాశ్వతస్థాణుః |
అప్పుడే అది అమృతం. మృతమంటే మార్పు. మార్పులేని స్థితి అమృతం - శాశ్వతం కూడా. ఎప్పటికీ నిలుస్తుంది. స్థ+అణు, నిశ్చలమూ - అతిసూక్ష్మమూ అయిన తత్త్వమది. |
Page 17