#


Index

శ్రీ విష్ణు సహస్రనామ అంతరార్థము
నామం అంతరార్థము
సిద్ధిః ఆ మాటకు వస్తే సిద్ధికూడా వేరుగాదు. మనమే. పరిపూర్ణా ద్వైతంలో సిద్ధుడూ సిద్ధి అనే తేడాలేదు. సిద్ధుడి స్వరూపమే సిద్ధి.
సర్వాదిః
అచ్యుతః
ఆ దత్తే ఇతి ఆదిః - సర్వసంహార రూపమని భావం. కనుకనే దాన్ని చ్యుతం చేసేది ఏదీలేదు. అచ్యుతమది, తన స్వరూపస్థితి నుంచి చ్యుతి లేదు దానికి.
వృషాకపిః
అమేయాత్మా
సర్వయోగ
వినిస్సృతః
తేజో ఽ బన్నాత్మకమైన సంసారాన్ని వర్షించేదీ (వృషా) అదే. ఈ జలాన్ని మరలా పీల్చేదీ (కపి) అదే. లేదా వృష-సృష్టిస్తూ అక - దీనిలో చరిస్తూ పి-దీన్ని లయం చేస్తున్నదని కూడా అర్థమే. అయినా ఈ మేయమైన సంసారం లేదు దానికి, అమేయాత్మా, అది అసలు మేయమైతే గదా ఇది ఏర్పడటానికి, కనుకనే ఏ ఉపాయంతోనూ పట్టుకోలేము దాన్ని, సర్వయోగ వినిస్సృతమది. యోగమంటే ఉపాయం. అన్ని ఉపాయాల నుంచి తప్పించుకుపోతుంది.
వసుః
వసుమనాః
సత్యః
తప్పించుకొని ఎక్కడికో పోదు మరలా. ఎక్కడ బడితే అక్కడే వసిస్తున్నది. మనలో మనోరూపంగా వసిస్తున్నదదే. సద్విశేషంగా కాక సద్రూపంగా మాత్రమే చూస్తే మనవెలపల ఉన్న ప్రతి ఒక్కటీ అదే (సత్య)
సమాత్మా
అసమ్మితః
సమః
మా అంటే ఈ ప్రపంచమే, దీనిలో సమంగా పరచుకొని ఉండేది. ఎంతపరచుకొని ఉందో అంత దీనిలో పట్టకుండా ఉంది. విశేషంలో సామాన్య మిమడదు గదా. అందుచేత సమ్మితం కాదు. అసమ్మితం. అయినా కూడా ఈ మాతో అనగా ఈ విశేష ప్రపంచంతోనే కలిసి ఉంది. అదీ చిత్రం.

Page 16

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు