#


Index

భాగవతము - సందేశసారము

ధర్మం అంబరీషాదులు రాజ్యాలు చేస్తూ కూడా అనుసరించారా ధర్మం. కుచేలాదులు గృహస్థులయి కష్టదారిద్య్ర్య మనుభవిస్తూ కూడా అనుష్ఠించారు. ప్రహ్లాదాదులు బాల్యం నుంచీ అదే చింతనతో కాలం గడిపారు. మనకు రాజ్యాలు లేవు. భోజ్యాలు లేవు. తారకమైన భాగవత ధర్మాన్ని ఆచరించటానికేమి కష్టం.

తస్మాత్సర్వాత్మనా రాజన్ హరిస్సర్వత్ర సర్వదా శ్రోతవ్యః కీర్తి తవ్యశ్చ - స్మర్తవ్యో భగవాన్ నృణామ్

  శ్రోతవ్యం కీర్తి తవ్యం స్మర్తవ్యమైన విషయమది ఒక్కటే మానవులకు. పరీక్షిత్తును నెపం చేసుకొని మనలనే హెచ్చరిస్తున్నది భాగవతం.

యస్తూత్తమ శ్లోక గుణానువాదః సంస్తూయతే భీక్ష మమంగళఘ్నః తమేవ నిత్యం శృణుయాదభీక్షమ్...

  ఈనాడు మనకు మన జీవితాల్లో ఎదురయ్యే అన్ని అనర్ధాలూ తొలగిపోవాలంటే దానికి దివ్యౌషధం లాంటిది భగవత్తత్త్వాను సంధానమొక్కటే నని సందేశమిస్తున్నది. అంతేకాదు.

కర్మతంత్రుడగుచు కమలాక్షు గొల్చుచు - నుభయ నియతవృత్తి నుండెనేని... చెడును కర్మమెల్ల శిథిలమై....

  అని తద్భగవత్సేవా బలంతో మన సంచిత కర్మకూడా క్రమంగా సంక్షయమై మనోబలం చేకూరుతుందని కూడా హామీ ఇస్తున్నది. అలాటి మనశ్శుద్ధి సంపాదించి నప్పుడే మనమూ ఆ పరీక్షిదాదులలాగా సాత్వతులమవుతాము. సాధకులమవుతాము. భాగవతులమయి భాగవత ధర్మాన్నే అనుసరిస్తాము. అదే మనకెప్పటికైనా ఆ పరమ సత్యమైన భగవత్స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసి పూర్ణపురుషులుగా మార్చి మనకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. పరీక్షిత్తుకలాగే ప్రసాదించింది. శౌనకాదుల కలాగే అనుగ్రహించింది. మనమూ పరీక్షా శీలురమూ, శ్రద్ధాళువులమూ, అయితే చాలు. ఈశ్వరానుగ్రహం కూడా తోడయితే ఏ శుకుడో, ఏ సూతుడో మనకు దర్శనమిస్తాడు. ఉద్ధరిస్తాడు. ప్రకృతే అలాటి మహద్భాగ్యాన్ని మనకు ప్రసాదిస్తుంది. అచంచలమైన

Page 409

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు