#


Index

భాగవతము - సందేశసారము

అలాటి చిత్తశుద్ధి కార్యదీక్షా మనకు నేర్పటానికే ఈ కలియుగాదిలో ఈ భాగవత మహాపురాణమవతరించింది. అవతరించి మహావిభవ సంపన్నులైన చక్రవర్తుల దగ్గరి నుంచీ అకించనులైన కుచేలాదులు దాకా, స్త్రీ పురుష, బాలవృద్ధ, బ్రహ్మక్షత్ర, వైశ్యు శూద్రాంత్యజాది, వర్ణ వర్గభేదం లేకుండా, పాత్రలూ, కథలూ, సన్నివేశాలూ, చిత్ర భంగిమలలో అల్లిబిల్లిగా అల్లి అన్యాపదేశంగా ఉదాత్త గంభీరమైన ఒకానొక దివ్య సందేశాన్ని సమస్త దేశకాలాలకూ అందజేసింది. ఇది దాని సందేశమైతే దాని నందుకొని తదనుగుణంగా భాగవతమైన జీవితం జీవించటమే ఈ కలిక్లేశాన్ని దాటటానికి మనం చూపవలసిన ఏకైకాభినివేశం. ఓమ్ శాంతిః శాంతిః శాంతిః













Page 410

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు