
నిర్వహించవలసి ఉంటుంది. అదే ఇంతకు ముందు జరిగిందని చెప్పే ఇప్పుడిక జరగబోతుందని చెప్పే అవతార రహస్యం.
కాబట్టి అల్పజ్ఞులమైన మనం నమ్మినా నమ్మకపోయినా నిత్య ప్రవాహశీలమైన ఈ సంసార యాత్రలో జరిగేదేదో జరుగుతుంది. జరిగి తీరుతుంది. ఇది ఇలా జరుగుతుందని నీవూ నేనూ అనుకొంటేనే జరుగుతున్నదా ఏదైనా ఈ సృష్టిలో మంచిగాని చెడ్డగాని ఏది ఎంత మోతాదులో ఎప్పుడు జరగాలో అప్పుడది అంత గాఢంగానూ, గూఢంగానూ జరుగుతూనే ఉంది. చూస్తూనే ఉన్నాము. అందులో చెడ్డ మాత్రమే జరిగి మంచి జరగకుండా పోదు. చక్రనేమి క్రమంగా ఒకదాని తరువాత ఒకటిదాని కాలానికది జరగవలసిందే. రాత్రి పోతే పగలు రావటం లేదా అలాగే ఇది. ఇప్పుడీ కాలంలో చెడ్డ అనేది ఎంత చూడాలో అంత చూస్తున్నాము మనం. ఇదే కలికాలమంటున్నాము. ఇది పోయి మరలా దీనికి భిన్నంగా మంచి జరగవలసి ఉంది. అదే కృతయుగం. అలా పరివర్తనం కావాలంటే సామాన్యమైన పనిగాదు. మనబోటి అల్పవీర్యులైన మానవులు సాధించేది కాదు. మనతో కలుపుకొని ఈ సమస్త సృష్టికి అధినాథుడెవడో వాడి కర్తవ్యమది. అదే మత్స్యాది కల్క్యంతమైన అవతారోదంతం.
అసలీ విచికిత్స దేనికి మనకు. పోనీ ఇదంతా వట్టి పుక్కిటి పురాణమే అనుకొందాము. పురాణకథలనేవి కాల్పనికమే నని హేతువాది అనకముందు మేమే స్వయంగా చెబుతున్నాము గదా. అయితే కథ కల్పన అయినా అది సూచించే భావం మాత్రం కల్పన కాదు. మన అనుభవమెంతో అంత యథార్ధమది. ఆ యథార్ధాన్ని చెప్పటానికే ఈ కథ అనే ప్రణాళిక Medium. అలా భావించినా ఈ అవతారాదుల అంతరార్థం బోధ పడుతుంది మనకు. మన వైయక్తిక జీవితాలలోనే చిన్నప్పటి నుంచీ ఇప్పటిదాకా దేశ కాలావస్థలలో ఎన్నో మార్పులూ చేర్పులూ చూస్తున్నాము. దేశచరిత్ర, ప్రపంచ చరిత్ర చూస్తే ఎన్నో వింతలు, విశేషాలు, విడ్డూరాలు. నేటి మానవుడు నమ్మశక్యంగాని మాటలుగా కనిపిస్తాయి. దీనిని బట్టి ఈ విశ్వచరిత్ర ఇంకా ఎంత చిత్ర విచిత్ర రీతులలో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఎంతో బంగారం వంటి కాలం చూస్తూ చూస్తుండగానే పోతుంది. పనికిమాలిన కాలం వస్తుంది. మానవుల బుద్ధులూ దానికి తగినట్టే తయారవుతాయి. అదే ధర్మ
Page 407
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు