#


Index

భాగవతము - సందేశసారము

“అశ్నోతి సర్వమ్ సర్వత్రేతి అశ్వః” అని అశ్వ శబ్దానికర్థం. సర్వత్రా సర్వపదార్ధాలను కనులు మూసి తెరిచేలోగా వ్యాపించేదేదో అది అశ్వమంటే. మనోజవంతో ప్రయాణించే ఒక సాధనం. తమకన్నా వేగంగా పోయే ఎగిరే పాత్రలేమిటో Flying Saucers అంతు పట్టటం లేదీ ఆధునికులకు. అత్యాధునికమైన ఈ పరికరమేమిటో ఇక ఎలా పడుతుంది. అలా అంతుపట్టని వాహనం ఎక్కడి దాయనకు. దేవదత్తమట అది. దేవతలంటే మన కతీతమైన దూరపు గోళాలలో నివసించే అతీతశక్తులు గల జాతి. అది సరఫరా చేసిన వాహనమది. దానిమీద తిరుగుతూ మెరుపుదాడి చేసే ఆ అజ్ఞాత వీరుణ్ణి ఎవరడ్డుకోగలరు.

  పైగా యంత్రబలమే గాదు. సహజంగానే బలసంపన్నుడాయన. సహజ బలమంటే దేహబలమని కాదు. దేహబల మీనాటి యంత్రబలం ముందేమి పని చేయగలదు. అది కాదాయన బలం. మరి ఏ బలం. అష్టశ్వర్య బలం. అష్టసిద్ధులే అష్టశ్వర్యాలు. అణిమ మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిత్వం. ఇవి ఎనిమిదీ అష్టసిద్ధులు, ఇందులో ఏ ఒకటి ఉన్నా చాలు ఈనాటి భౌతిక విజ్ఞానానికి జవాబు చెప్పవచ్చు. ఎనిమిదీ సిద్ధిస్తే ఇక చెప్పేదేముంది. ఇవి ఆ పరమేశ్వరుడనుగ్రహిస్తే సిద్ధిస్తాయి యోగులకు. అలాంటప్పుడా పరమాత్మకే ఇవి ఉండటంలో ఆశ్చర్యమేముంది. జ్ఞానైశ్వర్య బలవీర్య తేజశ్శక్తులనే షడ్గుణాలూ సమగ్రంగా ఉన్నవాడే గదా భగవంతుడంటే అలాంటి భగవంతుడికి తిరుగేముంది. కనుకనే అసినా 2 సాధు దమనమ్. నందకమనే తన దివ్యకరవాలంతో చెక్కలు ముక్కలు చేస్తాడా కల్కి, ఎవరిని. అసాధువులను. ఇదే దుష్టశిక్షణ. దీని కుపయోగించే ఆ కరవాలానికే మారణాయుధాలూ దీటేగావు. సహస్రాంశుడి దగ్గర ప్రదీపాంశువుల మాదిరి నిస్తేజమై నిలిచిపోతాయి. ఆశుగమైన హయాన్ని అధిరోహించి అప్రతిమానమైన ప్రాభవంతో దశదిశలా చరిస్తూ, రాజలాంఛనంతో బ్రతికే చోరులైన రాజులందరినీ చించి చెండాడుతాడా దేవుడు.

యదావ తీర్డ్లో భగవాన్ - కల్కర్ధర్మ పతిర్హరిః కృతం భవిష్యతి తదా - ప్రజా సూతిశ్చసాత్త్వికీ

  ఆ విధంగా భగవానుడు కల్కిరూపంగా అవతరించి అతిమానుషమైన బలంతో దుష్టబలాన్ని శిక్షించటమేమిటి. మరుక్షణమే కృతయుగ ధర్మమావిర్భవించటమేమిటి.

Page 405

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు