#


Index

  పూజా పురస్కారాలన్నీ అయిన తరువాత మనం చేస్తున్న పని ఏమిటి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. లేచి నిలుచొని మన చుట్టూ మనం తిరగటమే గదా. మనమంటే ఈ దేహాత్మ గాదు, ప్రాణాత్మ గాదు. ఇంద్రియాత్మ గాదు విజ్ఞానాత్మ కాదు. కర్రాత్మకాదు. మరే ఆత్మ. ప్రత్యగాత్మ అది మనం చేసే ప్రతి క్రియకూ సాక్షిగా నిలిచిన విశుద్ధ చైతన్యం ఆత్మ ప్రదక్షిణ మంటే అదీ అసలాత్మ అది శరీరాద్యుపాధి రహితం కాబట్టి పరమాత్మ కూడా అదే. అందులోనే జీవ జగదీశ్వరులుగా భాసించే త్రిపుటి సంపుటీ కృతమయింది. కాబట్టి అదే సర్వాత్మ కూడా ఈ సర్వాత్మ రూపుడనైన నాకు నేను ప్రదక్షిణం చేస్తున్నానని భావం. ఇదే ఫల శ్రుతి వ్యాజంతో మానవ జీవితానికి భగవత్పాదులు ప్రసాదిస్తున్న మహాఫలం.

  సంసారమనేది ఒక వృక్షమనుకొంటే దానికి ఫలం మోక్షమని వాక్రుచ్చారు పెద్దలు. బీజం నుంచి వృక్షమేర్పడితే ఆ వృక్షం నుంచి చివర కేర్పడేది ఫలం ఆదిలో బీజం అంతంలో బీజం ఫలాన్ని కోసి చూస్తే మరలా బీజమే కనిపిస్తుంది మనకు కాబట్టి ఒక విధంగా చూస్తే బీజమే ఆది బీజమే అంతం. పోతే మధ్య మంతా కేవలం దాని ప్రసరణ దాని విస్తరణే. మొత్తాని కాది మధ్యాంతాలు మూడు దశలలోనూ ఉన్నదొకే ఒక తత్త్వం. ఒకే ఒకటన్న దానికి ఈ స్తోత్రం కూడా మనకు సూచకమే. దక్షిణామూర్తి స్తోత్రమని గదా దీనికి నామధేయం ఆ మూర్తితోనే ఆరంభమయిందీ స్తోత్రం. ఆ మూర్తితోనే అంతమయింది. కాదు కాదు. అమూర్తితో అంతమయింది మొదట దక్షిణమైన మూర్తి ఆది చివర కదే దక్షిణమైన అమూర్తి.

Page 99