మనకూ మనం వేరనుకొని చూచే ఈ ప్రపంచానికీ స్వరూపమైన మన ఆత్మచైతన్యాన్ని మనమే దురదృష్టవశాత్తూ మరచిపోయాము. కొన్ని వేల జన్మలయింది ఆ మరచిపోయి కూడా అలా మరవటం వల్లనే అది మనపాలిటి కొక పెను సమస్య అయి కూచుంది మరచి పోయి మామ పెండ్లాన్ని అత్తా అన్నట్టు మరలా దానినే మనం జ్ఞప్తికి తెచ్చుకోవలసి వస్తున్నది సో యం దేవదత్తః అన్నట్టు సో హం అనే ప్రత్యనుంధానమిది దీనికే ప్రత్యభిజ్ఞ అని ఒక చక్కని నామకరణం చేశారు స్వామివారు. ప్రత్యభిజ్ఞకు దోహదం చేసే మహనీయుడే సద్గురువు. అలాటి గురూపదేశం పొంది సాధన చేస్తే మరచిపోయిన మన పూర్వ స్థితినే మరలా మన మందుకోగలం జగద్గురువులే మనకందరికీ గురుపాదులు. వారా పదవిని మొదట అందుకొనే ముముక్షువులైన మనకందరికీ పంచిపెట్టారు. మనబోటి శిష్యులం కూడా అందుకోగలిగా మిప్పుడదే పదవిని.
కాబట్టి మన చుట్టూ మనమే ప్రదక్షిణం చేశామింతకూ. దక్షిణామూర్తి ప్రదక్షిణ మని దీనికి నామకరణం చేసింది ఇందుకే నేను. దక్షిణామూర్తి చుట్టూ దక్షిణామూర్తి తిరిగాడు. ఎవడు దక్షిణామూర్తి అంటే గురుమూర్తే. ఎవడా గురుమూర్తి. శిష్యమూర్తి అయిన మనమే దక్షిణామూర్తి చుట్టూ అంటే తదభిన్నులమైన మనచుట్టూ మనమే నన్నమాట. దక్షిణామూర్తి ప్రదక్షిణమని పేరేగాని మన చుట్టూ మనం చేసిన ప్రదక్షిణమే ఇది.
Page 98