నివేశము
ఇక్కడికీ స్తోత్ర గ్రంథం సమాస్తమయింది. సమస్య సాధన సిద్ధి మూడూ ప్రతిపాదించా రాచార్యుల వారిందులో. సిద్ధి అనేది ఎక్కడో లేదు. ఎప్పుడో అందుకోవలసింది కాదు. ఎందుకంటే అది మన స్వరూపమే అసలు. ఆదిలో అదే, మధ్యలో అదే అంతంలో అదే. అయితే శోచనీయమేమంటే అది మన స్వరూపమే ననే సంగతి మరచిపోయాము మనం. మెడలో వేసుకొన్న బంగారు దండ ఎక్కడో తీసి పెట్టామని భ్రమపడ్డాము. అది మెడలో ఉంది. మెడలోనే ఉన్నదాన్ని ఇక ఎక్కడ వెదికితే ఏమి ప్రయోజనం. ఎక్కడ వెదికినా అది కనిపించదు. ఎప్పటికైనా మన మెడలోనే తడవి చూచుకొని అరెరే ఇక్కడే ఉందే నా దగ్గరే ఉందే - అని అనుసంధానం చేసుకోవటమే దానిని పొందటం. అదే మనం చేయ వలసిన సాధన.
సరిగా వేదాంత రంగంలో కూడా ఇదే సాధన మరేదీ కాదని బోధిస్తారు జగద్గురువులు మనకు.
Page 97