#


Index

  ఇలాగ ఇంకా మన పురాణేతి హాసాలలో ఆయా దేవతలూ మహార్షులూ చూపుతూ వచ్చిన వెన్నో ఉన్నాయి సిద్ధులు వారి శాపానుగ్రహాదులన్నీ ఈ కోవకే వస్తాయి. పోతే ఇలాటి అణిమాద్యైశ్వర్య మవ్యాహతంగా సిద్ధిస్తుందట ఈ జీవన్ముక్తుడికి.

  అయితే ఒక్క మాట గుర్తుంచుకోవాలి మనం. వాటిని ఎప్పుడూ అదే పనిగా ప్రదర్శిస్తూ కూచోడు. మహిమ చూపువాడు మధ్యముండు అన్నట్టు ఇవి చూపే చాపల్యం పెట్టుకోరాదు. అసలు వాడు పెట్టుకోడు కూడా కారణం అంతా బ్రహ్మాకారంగా చూచేటపుడు తన కంటే బాహ్యంగా ఎవరున్నారని ఎవరికి చూపాలని తాపత్రయం. ఇలాంటి తాపత్రయముంటే వాడి దృష్టి బ్రహ్మాకార మెలా అయింది అయితే మరి అడపా దడపా అయినా ఎలా చూపగలుగుతున్నాడని ప్రశ్న. ఆయా దేశకాల నిమిత్తాలను బట్టి - జీవుల ఇచ్ఛా నిచ్ఛాపఠేచ్చాది ప్రారబ్ధ కర్మను బట్టి - తద్వారా ఒక పని జరగవలసి ఉంటే అదే ఈశ్వర సంకల్పమైతే - ఆ ఈశ్వర ప్రేరణ కారణంగా ఆయా సిద్ధులు ఆయా పాత్రల ద్వారా బహిర్గత మవుతుంటాయి. కేవలం వారు నిమిత్త మాత్రులే. అవి జరుగుతున్నప్పుడు కూడా మిగతా లోకుల మాదిరి తానూ ఆ క్రియ కొక సాక్షిగా నిలిచి వీక్షిస్తుంటాడు జ్ఞాని. అలా అయితేనే వాడు సిద్ధ పురుషుడు కాకుంటే కాపురుషుడు. ఇదీ మన మిక్కడ గ్రహించవలసిన ధర్మ సూక్ష్మం.

Page 96