ఈ ప్రకారంగా జీవితం గడిపే జీవన్ముక్తుడి కబ్బని సిద్ధి అంటూ ఉండబోదు. సిద్ధుడంటే వాడు నిత్య సిద్ధుడైన పరమాత్మ స్వరూపుడే కాబట్టి పరమాత్మకు సహజంగా ఉన్న సిద్ధులన్నీ ఈ గురుమూర్తికీ సంక్రమిస్తాయి. అందులో మొట్టమొదటి సిద్ధి సర్వాత్మత్మ మహావిభూతి అన్నారు. సర్వత్రా సర్వదా సర్వమూ తన స్వరూపమే నని దర్శించటమే సర్వాత్మత్మ మహావిభూతి వట్టి విభూతి కాదిది. మహావిభూతి ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఏదంటే అదే కాగలడు. ఇంతకన్న కోరవలసిన దేమున్నది. సర్వకామః సర్వగంధ స్సర్వ రసః అన్నట్టు అన్ని కోరికలూ ఫలించినట్టు గదా. ఫలిస్తే అన్నిటి మీదా అన్ని లోకాల మీదా లోకస్థుల మీదా అప్రతిహతమైన అధికారం కూడా చెలాయించగలడు. స్యాదీశ్వరత్వం ఇదే ఈశ్వరత్వం ఇలాటి ఈశ్వరత్వం కూడా ప్రాప్తిస్తుంది.
అంతేకాదు 'తతః సిద్ధ్యేత్తత్పున రష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్' అణిమాద్యష్ట సిద్ధులు కూడా లభిస్తాయట. అణిమ మహిమా - లఘిమ - గరిమ ప్రాప్తి ప్రాకామ్యం - ఈశిత్యం వశిత్వం - ఇవే అణిమాదులు రామాయణంలో మహా జ్ఞానియోగి అయిన హనుమంతు డక్కడక్కడా ప్రదర్శిస్తూ వచ్చాడివి. రామ సందర్శనార్థం వచ్చినప్పుడు ప్రాకామ్యం - సముద్ర లంఘనంలో లఘిమ - సింహికాదుల విషయంలో అణిమ లంకిణి సహారంలో గరిమ - సీతాదేవి సమక్షంలో మహిమ -
Page 95