#


Index

  లోకంలో నీవే పదార్థామైనా చూడు అది జడమే కాదు చేతనమే గాదు ఈ రెండు గుణాలే కనిపిస్తాయందులో ఘటోస్తి ఘటో భాతి పటోస్తి పటో భాతి ఘటమున్నది ఘటం కనిపిస్తున్నది పటమున్నది పటం కనిపిస్తున్నది ప్రతిదీ లోకంలో ఉన్నది కనిపిస్తున్నది. ఇంతకన్నా ఏ పదార్థంలోనూ ఏదీ లేదు మనం చూడగలిగింది. అదేమి మాట. లావు సన్నం- పొడుగు పొట్టి నలుపు తెలుపు మంచి చెడు అనుకూలం ప్రతికూలం. ఇలాటి గుణాలు పరశ్శతంగా ఉంటాయి గదా పదార్థాలకు. అన్నీ ఒక గాట కట్టేసినట్టు ఇవి రెండే ననట మేమిటి. అవన్నీ చూడవలసిన గుణాలు కావా. అంటే చూడవలసినవే కాని రహస్యమేమంటే ఇవి రెండూ చూస్తే చాలు. అవన్నీ కూడా చూచినట్టు అవుతుంది. ప్రత్యేకించి చూడనక్కరలేదు. ఎంచేత నీవు మరే గుణముందని వర్ణించినా అది కూడా ఉండవలసిందే కనిపించవలసిందే అంతకన్నా విశేషమేముంది.

  కాబట్టి ఇలా విమర్శ చేస్తూపోతే సాధకుడి దృష్టికి విశేషాలుగా కనిపిస్తున్న వన్నీ సామాన్య రూపంగానే దర్శనమిస్తాయి. అంటే ఏమన్న మాట. సద్విశేషాలుగా చిద్విశేషాలుగా Particulars కాక సచ్చిత్సామాన్యం Universal గానే మారి కనిపిస్తాయి. విశేషాలన్నీ అసలు సామాన్యం నుంచి వచ్చినవే. సామాన్యం కంటే అవి వేరుకావు. కనుక సామాన్య దృష్టితో చూస్తే ప్రతి ఒక్క విశేషమూ మరలా సామాన్యంగానే కనిపిస్తుంది.

Page 87