మరుగు పడి ఉన్న యస్యైవ అని ఇప్పుడు జ్ఞాపకం చేయటం వల్ల అది మనసకు వచ్చింది. ప్రపంచమే గాక ప్రపంచంతోపాటు దానికి కారణమైన పరమాత్మ తత్త్వం కూడా మన స్మృతి పధంలో తళుక్కున మెరిసిందని భావం.
యస్యైవ అంటే ఎవరికి చెందిందో అని గదా అర్థం ఎవరకంటే ఎవరా ఎవరు. ఇంకెవరు. ఆత్మ చైతన్యమే దానికి సంబంధించినదే ఇది. నీవిది ఇన్నాళ్లు దేనికీ సంబంధించని పదార్థాంగా చూస్తున్నావు. అలా కాదు చూడవలసింది అలా చూచే కొద్ది దీని వత్తిడిని నీవు భరించ వలసి వస్తుంది. దీని నాత్మతో ముడిపెట్టి దానికి సంబంధించినదిగా చూడు. వాస్తవంలో అదే ఈ రూపంలో కనిపిస్తూ ఉన్నది కాబట్టి అలా చూచావంటే దాని దృష్టి దీనిమీద పడి దీని ప్రభావం తగ్గుతుంది. ఎందుకంటే అది ఏకం. నిరాకారం ఇది అనేకం సాకారం ఆ దృష్టితో చూస్తే ఈ అనేక మేకంగానూ సాకారం నిరాకారంగానూ కనిపించి మన బుద్ధి ఈ ప్రపంచంలోని అనేకాకృతులలో తగులుకొని క్రుంగిపోకుండా తేలికపడి నిర్లిప్తంగా పైపైన సంచరిస్తుంది. అప్పుడది బంధావస్థ నుండి అప్రయత్నంగానే మోక్షావస్థవైపు సాగిపోగలదు. ఇలా కార్యప్రపంచాన్ని అలాయి దాగా గాక కారణ రూపమైన చైతన్యంతో కలిపి పట్టుకోవట మనేది సాధన మార్గంలో రెండవ భూమికగా చెప్పవచ్చు.
Page 85