#


Index

  ఈ ప్రపంచం కాబట్టి ఇది కూడా వెంటనే తద్రూపంగా మారి కనిపిస్తుంది. కాగా ఆ చైతన్యం సాధకుడి స్వరూపమే కాబట్టి కార్య కారణాలుగా విభక్తమయి ఉన్నదంతా అవిభక్తమై తన రూపంగానే తన కనుభవానికి వస్తుంది. ఇదీ ఉన్న విషయం.

  ఇదంతా ప్రత్యభిజ్ఞా సూత్రం మీద ఆధారపడి ఉంది. అందులో కూడా మూడు భూమికలని పేర్కొన్నాము. మొదట కార్యాన్ని ఫలానా అని చూడటం తర్వాత దానిలో దాని కారణాన్ని ప్రత్యభిజ్ఞా బలంతో గుర్తించి దానితో దీనిని ముడిపెట్టటం ఆ పిమ్మట దేనితో ముడిపెట్టటం ఆ పిమ్మట దేనితో ముడిపెట్టామో దాని రూపాన్నే దీనిలో దర్శిస్తూ అంతకంతకు ఈ కార్య ప్రపంచాన్ని తత్కారణ రూపమైన చైతన్యంలో కరగ దీయటమూ ఇదే సాధన ఈ మాత్రం చేస్తే చాలు. తరువాత మనమేమీ చేయకుండానే ఆత్మ అనేది దానిపాటి కదే సాక్షాత్కరిస్తుంది.

  ఏతావతా ఈ త్రివిధమైన సాధన మార్గాన్నే నిర్దేశిస్తున్నారిప్పుడు జగద్గురువులు. “భూరంభాంస్యనలో నిలోంబర మహర్నాథో హిమాంశుః పుమాన్" భూః అంటే భూమి అంభాంసి అంటే జలం. అనలః అంటే అగ్ని అనిలః అంటే వాయువు అంబర మంటే ఆకాశం దీనితో పృథివ్యప్తేజో వాయ్వాకాశాలనే పంచభూతాలూ చెప్పినట్టయింది. పోతే ఇంకొక మూడున్నాయి మాటలు. అహర్నాథః హిమాంశుః పుమాన్ మామూలుగా అర్థం చెబితే అహర్నాథ శబ్దానికి సూర్యుడని అర్థం హిమాంశుః అంటే చంద్రుడు. మరి పుమానంటే పురుషుడు లేదా యజమానుడని అర్థం.

Page 82