#


Index

  జరగాలంటే ఏమి చేయాలిప్పుడు మనం. కార్యమనేది మన దగ్గరే ఉంది కాబట్టి- ఇందులో ఉన్న దాని కారణ స్వరూపమే గాని మరేది కాదు కాబట్టి దీనిని చూస్తున్నప్పుడంతా దానినే గుర్తు చేసుకొంటూ పోవాలి. ఈ గుర్తు చేసుకోవటమే ప్రత్యభిజ్ఞానమని పేర్కొన్నాము. ఇదే వేదాంతంలో మనం చేయవలసిన సాధన అంతా ఇంతకు మినహా మరేదీ లేదు. ఏదో ఉందనటానికి క్రొత్తగా ఏదీ సృష్టించ బని లేదిక్కడ. అంతేకాక దాని నొకా నొక రూపంలోనిగా పెట్టి చూడనక్కర లేదు. అది స్వతస్సిద్ధంగా ఉన్న పదార్థం. చైతన్యం తప్ప విడిచి దానికి మరో రూపమేదీ లేదు. మరే రూపంలో భావించినా అది అది కాదు. అందుకే కర్మోపాసన లేవీ అక్కరలేదీ మార్గంలో అసలు పనికి రావని కూడా చాటి చెప్పారు బ్రహ్మవేత్తలు. జ్ఞానమనేది ఒక్కటే దానికి సాధనం జ్ఞానానికి బాహ్యమైన పరికరాలేగాని అక్కరలేదు. కేవలం మానసికమైన దృష్టే అది.

  ఆ మాటకు వస్తే అది ఇప్పుడూ ఉంది మనకు. అయితే ఈ కార్య ప్రపంచం మీదనే ఉందా దృష్టి పెండ్లాం- బిడ్డలు - ఇండ్లు వాకిండ్లు ఇలాంటి ప్రాపంచిక భావాలు ఒకటి తప్పితే ఒకటి చూస్తూ ఉంటుందీ దృష్టి. కనుకనే బంధకమయి కూచుంది మనకు. బంధమోచకం కావాలంటే ఈ దృష్టినే కార్య ప్రపంచంలో అంతటా పరచుకొని ఇందులోనే డిందుపడి ఉన్న కారణ చైతన్యమేది ఉందో దాని మీదికి మళ్లించాలి. మళ్లించి అదే ధ్యానించి చూస్తే దాని వివర్తమే

Page 81