కార్యమంటే దీనికే సంస్థానమని Formation పేరు పెట్టారు భాష్యకారులు. కారణం ధరించిన రూపమే గనుక అందులో వెతికితే మనకు కనిపించేది కారణ స్వరూపమే అంతకుమించి మరేదీ దొరకదు. ఒక మంచుగడ్డ జలం మీద తేలుతూందంటే అది ఆ జలం తాలూకు సంస్థానమూ లేదా రూపమే గదా. జలమే అలా ఒక ఆకృతిని ధరించి ఎప్పుడు కనిపిస్తున్నదో అప్పుడందులో జలం తప్ప మరేదీ కానరాదు. కరగించనే అక్కరలేదు. కరగకుండా ఘనంగా ఉన్నప్పుడు కూడా అది జలమే. జలమే ద్రవంగానూ ఘనంగానూ రెండు రూపాలలో భాసిస్తున్నది. ఉన్నదొకే పదార్థం రూపాలే రెండు అందులో ద్రవంగాని స్వరూపమైతే ఘనంగా దాని విభూతి ఈ విభూతి దశనే కార్యమని పేర్కొంటున్నాము మనం.
కార్యమనేది అప్పటికేదోగాదు. కారణమే. మరి కారణం కాక కార్యంగా ఎందు కనిపిస్తున్నదది. స్వరూపంలో గాక మరొక రూపంలో భాసించటం వల్ల అలా భాసించే సరికి దాని రూపమే దాని స్వరూపాన్ని కప్పి వేసింది. మాయం చేసింది. మనకు దాని సహజ స్వరూపమేదో గుర్తు పట్టకుండా ప్రతిబంధకమై కూచుంది. పైగా దానికి బదులు తానే అక్కడ ఉన్నట్టు భ్రమ గొలుపుతుంటుంది. కొలిపేసరికి రూపం మీదనే తిరుగుతూ ఇందులోనే తగులుకొని మన దృష్టి ఇది దేనిరూపమో. దానిమీదకి పోవటం లేదు. పోతే మరేదో గాదు అదేనని తెలిసిపోయేది అలా జరగటం లేదు మరి.
Page 80