త్రాడు కనిపించట మనేది రెండవ మెట్టు అప్పుడా త్రాడనే దృష్టితో చూచా మంటే అంతకు ముందు సర్పంగా కనిపించిన ఆకారం రజ్జువుగా మారి అందులోనే లయమవుతుంది. ఇది మూడవ మెట్టు. దీనితో సమస్య పరిష్కారమయింది. త్రాడు పాము కావటం సమస్య అయితే పాము మరలా త్రాడయి కనిపించటమే పరిష్కారం.
అయితే త్రాటి యొక్క ఆభాసే పాము కాబట్టి చూడగానే పాము లయమయింది. మరి అన్ని కార్యకారణాల లోనూ ఇంత సులభంగా లయంగాదు కార్యం. ఇంతెందుకు రజ్జు సర్ప న్యాయంగాక ఒక సువర్ణాభరణ న్యాయాన్నే తీసుకొని చూతాము. ఆభరణం సువర్ణంతో తయారైనదే సువర్ణ కార్యమే అది. సువర్ణ దృష్టితో చూస్తే అది రజ్జు సర్పం లాగా లయం కావలసిందే న్యాయమైతే, కాని అంత సులువుగా కావటం లేదది. సువర్ణం కనిపించి నపుడు కూడా కటక కేయూరాదులైన ఆభరణాలు మాసిపోవటం లేదు. దానితోపాటు అవీ కనిపిస్తూనే ఉంటాయి. అదే పనిగా కరిగిస్తే చెరిపిస్తేనే లయమై పోయేది. మరి ఇక్కడ ఎలాగా పరిష్కారమని ప్రశ్నవస్తుంది.
అందుకే ఇలాటి చోట్ల ప్రత్యభిజ్ఞా బలంతో చూడమంటారా చార్యులవారు కార్య రూపం Form కనపడుతున్నా అందులో దాని కారణ ద్రవ్యాన్ని Substance అంతకంతకు పోల్చుకొని చూస్తూ చివర కంతా కారణమేనని తేల్చుకోవటమే ప్రత్యభిజ్ఞ. అసలు రహస్యమేమంటే కార్యమని ఊరక మాట వరసకనటమే గాని అది వస్తు రూపంగా ఎక్కడా లేదసలు. మరేమి టంటారు కారణం ధరించిన మారురూపమే
Page 79