రెండవది మన మిక్కడి నుంచి పయనం సాగించవలసిన మధ్య భూమిక. మూడవది అలా పయనిస్తూ చివరకు మన మందుకోవలసిన కడపటి భూమిక. దృష్టాచ్చ అదృష్టసిద్ధిః అని స్వామివారే చెబుతుంటారు. ఒకటి పరిష్కరించాలంటే, అసలు పరిష్కరించుకోవలసిన విషయమేమిటో ఒకసారి జ్ఞాపకం చేసి క్రమంగా, దాని నసలు దానితో ముడిపెట్టి చివరకు దీన్ని దానిలో కలపటమే. మన మందుకోవలసిన కడపటి భూమిక. దృష్టాచ్చ అదృష్టసిద్ధిః అని స్వామి వారే చెబుతుంటారు. అప్పుడీ సమస్య సమస్య రూపాన్ని వదిలేసి పరిష్కార రూపాన్ని ధరిస్తుంది.
దృష్టాంత మొకటి మనవి చేస్తాను. మసక చీకట్లో ఒకటి సర్పం లాగా కనిపిస్తున్నది. వాస్తవంలో అది సర్పం కాదు. త్రాడు. అయితే త్రాడనే విషయం మన కప్పట్లో తెలియదు. ఈ పాము బయటికి రావటానికదే కారణమైనా అది మనకు గోచరం కావటం లేదు. మీదు మిక్కిలి సర్పాకారంగా కనిపిస్తూ మనలను భయ భ్రాంతులను చేస్తున్నది. అంటే కారణమే కార్య రూపంలో కనిపిస్తున్నదన్న మాట. ఈ కార్యరూపంగా కనిపించటమే సమస్య అంటే. ఇప్పుడీ సమస్యను చూస్తున్నాము మనం. ఇది మొదటి మెట్టు మరి ఈ చూచే సర్పాన్ని ఏమి చేయాలి. ఎలా తొలగిపోతుందిది. దీనికేమిటి పరిష్కారం మరలా దీని ఆవిర్భావానికి కారణమేదో ఆ త్రాడును చూడటమే. దీపం వెలిగించి చూచామంటే త్రాడు కనిపిస్తుంది.
Page 78