అది కార్యానికి విలక్షణంగా కారణచైతన్య మొకటుందని - దానికి ఈ కార్య ప్రపంచం వ్యతిరిక్తం కాదనే అద్వైత జ్ఞాన మలవడక పోవటమే. అది మాయా పరిభ్రమణం వల్లనే మొత్తానికి ఈ అనర్థ పరంపర కంతటికీ మూలమనాది కాల ప్రవృత్తమైన మాయా శక్తి విజృంభణమే నని తేలిపోయింది.
9
అన్ని అన్నర్థాలకూ మూల కారణం మాయా విజృంభణమే నని ప్రతి పాదించాము. బాగానే ఉంది. అయితే అది కేవలం రోగ నిదానం Diagnosis of the Disease మాత్రమే. చికిత్స కాదు. మరి ఏ రోగానికైనా చికిత్స అనేదొకటి ఉండాలి గదా. చికిత్స సూచించకుండా వ్యాధిని మాత్రం వర్ణించి సుఖమేముంది. సమస్య సమస్య గానే నిలిచిపోతుంది. సమస్య ఏదో తెలిసిందిప్పుడు మనకీ సంసారమేనని దానికి నిమిత్తం కూడా తెలిసింది మాయా విజృంభణమని మరి దానికి పరిష్కారం కూడా చూసి చెప్పాలి గదా అదేమిటని ఇప్పుడు ప్రశ్న.
అదే చెబుతున్నారిప్పుడాచార్యులవారు "భూరం భాంసి” అని పరిష్కార మన్నప్పుడది ఎప్పుడూ మూడు భూమికలలో Stages నడుస్తుంది. మొదటిది మన మిప్పుడున్న భూమిక.
Page 77