#


Index

  కాబట్టి కడుపటి కన్ని సంబంధాలూ కలిసి కార్య కారణ సంబంధ మొక్క దానిలోనే సమసిపోతాయి.

  అసలీ జగత్సృష్టి అంతా ఎలా జరిగింది. మాయా మయంగా నైనా జరగనేమో జరిగింది. "మాయా వీవ విజృంభయత్యపి" అన్నప్పుడు కారణమెవరీ సృష్టి కార్యానికి. ఆ మాయావి అయిన పరమాత్మే. ఆయన శక్తే మాయ. దాని ద్వారా జరుపుతున్నాడీ సృష్టి. కనుక ఆయన గారే దీనికి మూల కారణం. కాగా సృజ్యమానమైన చరాచర విశ్వమంతా ఇక కార్యం. "స్వప్నే జాగ్రతివా” స్వప్న జాగ్రద్దశలలో ప్రతి క్షణమూ పశ్యతి చూస్తూనే ఉన్నా మీ కార్య ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాము. భేదతః పరస్పర భిన్నంగా ఏమిటా భిన్నమంటే కార్యమనీ కారణ మనీ ద్వంద్వంగా చూస్తూన్నామే ఇదే భేద దృష్టి. ఎలా ఏర్పడింది ఈ దృష్టి కార్య జగత్తును మాత్రమే చూస్తూ తత్కారణం మేదో దాన్ని విస్మరించటం వల్ల కారణమిక్కడ ఆత్మచైతన్యమే. దానినెప్పుడు మరచామో ఏక రూపమైతే అదే మనకిలా అనేక రూపాలుగా భాసిస్తున్నది. భాసించేసరికి ఈ భాసించే ప్రపంచం మనకు స్వమ్మని - దీనికి నేను స్వామినని - స్వస్వామి సంబంధ మొకటి కల్పించుకొని ఇంకా ఇందులో కూరుకుపోయాము. ఈశ్వరుడు కల్పించింది. కార్యకారణ సంబంధమైతే- జీవులు కల్పించుకొన్నది ఈ స్వస్వామి సంబంధం అది ఈశ్వర సృష్టి ఇది జీవ సృష్టి.

  దీనితో ద్విగుణీకృత మయింది మనకీ సంసార బంధం ఇదంతా భేద మూలకమే. అభేద భావన లేకపోవటం వల్లనే.

Page 76