#


Index

  మన చైతన్యమే గదా బాల్యాది దశలన్నిటిని అనుభవిస్తూ వచ్చింది. ఆ చైతన్యమే చివర మరణ దశను కూడా అనుభవించాలి. తప్పదు. అనుభవిస్తున్నదంటే ఇక చైతన్యమున్నట్టే గదా. చైతన్యమున్నదంటే ఏమని అర్థం. ఆత్మ ఉందనే. కనుకనే ఆత్మకు వినాశం లేదు. అది అవినాశి అని చాటింది శాస్త్రం.

  స్వాత్మానం. ఇదే మన ఆత్మ స్వరూపం. ఇది జీవితాంతమూ మన లోపల నేను నేనని స్ఫురిస్తూనే ఉంది. రేపు జీవితానంతరం కూడా స్ఫురిస్తూనే పోతుంది. ఇతరుల కది గ్రహణ గోచరం కాకపోవచ్చు. ఎవడి అనుభవంలో వాడికి గోచరిస్తూనే ఉంటుందప్పుడు కూడా. అయినా ఆశ్చర్యమేమంటే ఇంత సన్నిహితంగా అనుభవానికి వస్తున్నా దాని నప్పుడప్పుడు లేదని భావిస్తుంటాము. మనమంతా ఉందని భావించే టపుడు కూడా అసలైన అచ్చమైన ఆత్మను పట్టుకొని భావించటం లేదు. అసలైనది కాదని ఎలా చెప్పగలవు. జాగ్రత్తులో ప్రతి ఒక్కడూ నేనని తన స్వరూపాన్ని గ్రహిస్తూనే ఉన్నాడు గదా అని అడగవచ్చు. నేనని గ్రహిస్తున్నా అది అసలు కాదు నకిలీ నేను False Self అసలు నేనే అయితే ఒక్కటే మాట. ఇక నీకు అనాత్మ ప్రపంచమనేది మనసుకు రాగూడదు. రజ్జువును గమనిస్తే మరి నీకు స్పర్శ కనపడుతుందా. కనపడదు కనపడుతున్నదంటే రజ్జువును నీవు పూర్తిగా చూడలేదన్న మాట. అలాగే ఆత్మ ఫలానా అని దర్శించావంటే ఇక నీకు అనాత్మ ప్రపంచం కనిపించరాదు. కనిపించకుండా ఎక్కడ పోయింది. జాగ్రదాది దశలలో కనిపిస్తూనే ఉంది గదా ప్రపంచం.

Page 69