కాబట్టి ఇంతకూ తేలిందేమంటే జాగ్రత్స్వప్ససుషుప్తులనే మూడవస్థల లోనూ మన ఆత్మ చైతన్యాని కెలాటి క్షతీ లేదు. అవిచ్ఛిన్నంగా ప్రకాశిస్తూనే ఉంది. ఎక్కడైనా ప్రకాశించటం లేదనిపిస్తే ప్రత్యభిజ్ఞాయతే అది మరలా ఉందని మనం ప్రత్యభిజ్ఞా బలంతో ఆకళింతకు తెచ్చుకోవచ్చు. ఇక భయమేముంది.
7
మొత్తానికొక పదార్థమెప్పుడూ ఉందని నిరూపించటానికి మనకీ ప్రత్యభిజ్ఞ అనేది గొప్ప ఆధారం. ప్రత్యభిజ్ఞకు అవకాశమున్నంత వరకూ పదార్థముందనీ దాని కవకాశమే మాత్రమూ లేదప్పుడే ఆ పదార్థం లేదనీ తీర్మానించవచ్చు. ఆ సూత్రాన్ని బట్టి చూచామంటే ప్రస్తుత మాత్మానాత్మలనే రెండింటిలోనూ ఆత్మచైతన్యమే ఎప్పుడూ ఉన్న పదార్థం. అనాత్మ భూతమైన ఈ ప్రపంచ మసలు లేనే లేదు. అసలొకటి ఉందంటే ఎప్పుడూ ఉంటుంది. లేదంటే ఎప్పుడూ లేదని సిద్ధాంతం. కాని విచిత్రమేమంటే లేని ప్రపంచాన్నే ఉన్నదని చూస్తున్నాము. ఉన్న ఆత్మ స్వరూపాన్నే లేదని భావిస్తున్నాము. ఇందుకు కారణమొక్కటే మన మేది చూచినా ఆ పాతతః Superficial చూచి అక్కడి కక్కడే సత్యమని తలుస్తామే గాని తలస్పర్శిగా లోతుకు దిగి విచారణ చేయము.
Page 65