#


Index

  ప్రస్తుతం జాగ్రదావస్థలో నిన్ను నీవు మరలా జ్ఞాపకం చేసుకొంటున్నావు. ఏమని రాత్రి నేను నా గదిలో పడుకొని గాఢంగా నిద్రపోయానని. ఎంతో హాయిగా ఉంది. నాకేమీ తెలియలేదని తెల్లవారి లేచి నలుగురికీ చెబుతున్నావు కూడ. మరి ఈ సుఖమూ అజ్ఞానమూ రాత్రి సుషుప్తిలో నీవు అనుభవించకపోతే ఇప్పుడు జ్ఞాపకమెలా రాగలిగాయి నీకు. అనుభవించే గదా స్మరింప గలిగావు. స్మరిస్తేనే గదా నగలిగావు. కాబట్టి సుషుప్తిలో కూడా నీ గురించిన అనుభవముంది నీకు లేకుండా పోలేదు. లేదంటే పెద్ద ప్రమాదం. అక్కడికీ న చైతన్యం తెగిపోయిందని అర్థం. తెగి పోయిందంటే నిన్న రాత్రి వరకున్న నీవు మధ్యలో లేకుండా మాసపోయి తెల్లవారి మరలా ప్రత్యక్షమయ్యావని చెప్పవలసి వస్తుంది. అంతకన్నా హాస్యాస్పదం లేదు. నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః లేనిది రాదు. ఉన్నది పోదు ఒకప్పుడున్నది హఠాత్తుగా ఎలా లేకపోతుంది. నిన్నటి వరకున్న చైతన్యం లేదంటే అదీ ప్రమాదం అలాగే అంతవరకూ లేని దున్నట్టుండి ఎలా పుట్టుకొస్తుంది. సుషుప్తిలో తెగిపోయి మరలా ఆవిర్భవించిందంటే ఇదీ ప్రమాదం.

  కాకపోయినా చైతన్యమంటే ఏమిటి నేను నేనను కొనే భావనే గదా. అది నీ స్వరూపమే గదా. నీ స్వరూపమే గదా. నీ స్వరూపమే అయినది నీకెలా లేకుండా పోతుంది. లేకుంటే అది నీ స్వరూపమెలా అవుతుంది. అది లేదంటే నీవే లేవని అర్థం. నీవు లేవని ఎవరనుకోవాలి. నీవే గదా. నీవే అనుకొంటున్నావంటే నీవున్నట్టే గదా లేనని ఎలా అనుకోగలవు.

Page 62