సద్రూపంగానే కాదు. ఆ మాటకు వస్తే చిద్రూపంగానూ As conciousness ఉంది. ఎందుకంటే మనసు ద్వారా కాకున్నా తనపాటికి తానది ఉన్నాని భావిస్తూనే ఉంటుంది. సుషుప్తిలో కూడా దాని ఈ స్ఫురణకు లోపం లేదు. అలుప్త దృగ్రూపమని పేర్కొంటారు దాన్ని భాష్యకారులు. నిత్యమూ అవిలుప్తంగా అది ప్రకాశిస్తుంటే మనసనేది కేవలం బాహ్యానికి దాన్ని అభివ్యక్తం Exhibit చేసి చూపుతున్నది. ఒక అద్దంలో ఏదైనా వస్తువు ప్రతిఫలించి కనిపిస్తుందంటే అద్దమా వస్తువును సృష్టించిందనా అర్థం. అద్దం చూపినా చూపకపోయినా వస్తువు దాని పాటికది ఉండనే ఉంది. అద్దమనేది కేవలం దాని కభివ్యంజకమే Projector ఉత్పాదకం Cre-ator కాదు. అలాగే చైతన్యానికి కూడా మనసనేది కేవలమొక అభివ్యంజకమైన ఉపకరణం మాత్రమే ఈ ఉపకరణం పనిచేయక పోయినా ఫరవాలేదు. చైతన్యం దానిపాటి కది ప్రకాశిస్తునే ఉంటుంది.
ఏదీ దానిపాటి కది ఉన్నట్టు మనకేమిటి తార్కాణం మీదు మిక్కిలి మనసున్నప్పుడే ఉండి లేనప్పుడు కనపడటం లేదు. కాబట్టి అది స్వతహాగా లేదనే భావించవచ్చు గదా. తప్పేముంది అని శంకించవచ్చు. కాని అలా శంకించనక్కరలేదు ఎందుకంటే అది సుషుప్తిలో స్ఫురించటం లేదని గదా నీవు దాన్ని లేదని వాదిస్తున్నావు. సుషుప్తిలో అసలు లేకపోతే మరలా జాగ్రత్తులో మనకెలా స్ఫురిస్తున్నది ఏది గాని మొదట అనుభవానికి వస్తేనే తరువాత స్మరణకు వచ్చేది. ఎప్పుడూ అనుభవంలో లేని పదార్థ మున్నట్టుండి జ్ఞాపకం రాదు. ముందు అనుభవం Cogni-tion తరువాత జ్ఞప్తి Memory ఇదీ వరుస. అనుభవం లేని జ్ఞప్తి అంటూ ఉండబోదు. అది మన అనుభవానికే విరుద్ధమైన మాట.
Page 61