#


Index

  అప్పుడవి నిర్వాణమయి కూచుంటాయి. అంచేత మనచైతన్యమొకటి ఉన్నట్టు మనకప్పుడు స్ఫురించటం లేదు. స్ఫురించటాని కుపకరణం Instrument ఈ కరణమే ఇది నిర్వ్యాపార Defunct మయ్యే సరికది మనకు లేనట్టు భాసిస్తున్నది.

  అయితే ఒక ఆశంక. చైతన్యమనేది స్వతస్సిద్ధమని గదా ప్రతిపాదించారు. స్వతస్సిద్ధమన్నప్పుడు దానిపాటికది స్ఫురించాలి గాని కరణ వర్గముంటే స్ఫురించటం లేకుంటే స్ఫురించక పోవటమేమిటి. అదే చిత్రం స్వతస్సిద్ధమయి కూడా దాన్ని మనం మనస్సూ ఇంద్రియాలూ పనిచేస్తున్నప్పుడే ఉందని భావిస్తున్నాము. ఇప్పుడు నేనున్నానని ఎవడైనా అనుకొంటున్నాడంటే మనసుతోనే గదా అనుకొంటున్నాడు. మనసనే సాధనం తోనే నేనున్నాననే భావనకు మనం బాగా అలవాటు పడిపోయాము. ఇది ఈ జన్మలో కాదు. జన్మ జన్మల నుండీ మన కలవాటయిన జాడ్యం. కనుకనే మనసు కతీతంగా కూడా ఉన్నామనే సంగతి మరచిపోయాము మనం. మన మనసుంటేనే మనమున్నట్టు లేకుంటే లేనట్టు భ్రాంతి పడుతున్నాము. వాస్తవంలో మనసు కెలా స్ఫురిస్తున్నదో ఆ నేననే భావం దాని కతీతంగా కూడా అలాగే భాసిస్తున్నది. దీనిమీద ఆధారపడి లేదది కాని మనకది ఇంతవరకూ అంతుపట్టని రహస్యం కనుకనే మన అధికరణ వర్గం పనిచేయక నిలిచిపోయే సరకది ఉన్నట్టు మన కాచూకీ తెలియటం లేదు.

  అయితే మనస్సుకు గోచరించటం లేదు. అంతమాత్రమే గోచరించక పోయినా తన పాటికి తానుందది.

Page 60