#


Index

  వాటి ద్వారా మరలా మనకీ సంసారంతో సంసర్గ మేర్పడుతూ పోతుంది. కనుక ఇది ఒక విడరాని సంబంధ మీ వాసనా సంచయం మాయా రూపమైనది. అవిద్య Nescience అన్నా ఇదే. ఈ కారణ శరీరమే తరువాత కామ కర్మలనే రెండు శరీరాలకూ మూలం కాబట్టి వేదాంతులు దీన్ని కారణ శరీరమని వ్యవహరించారు. అవిద్యా రూపిణి కాబట్టి విద్యోదయమయ్యే వరకూ ఇది మనలను వదలి పెట్టదు. వెంటాడుతునే ఉంటుంది. విద్య అంటే ఏమిటి సర్వమూ ఆత్మ స్వరూపమనే జ్ఞానం సూర్యుడు ఉదయిస్తే అంధకారం తొలగినట్టు ఇది కూడా ఆత్మజ్ఞాన ముదయిస్తే చాలు పటాపంచలవుతుంది. అదే మోక్షం జీవుడికి అంతవరకూ తప్పదు దీని తాకిడి మనకు.

  ఇదుగో ఇదే సుషుప్తిలో మన కాచ్చాదన మయికూచున్నది. మాయా సమాచ్ఛాదన మన్నదిదే. స్థూల సూక్ష్మ శరీర స్మృతి లేకపోయినా- తద్వారా బాహ్య ప్రపంచ స్ఫూర్తి లేకపోయినా - సుఖం లేదు. వాటి వాసనా రూపమైన ఈ కారణ శరీరం తాలూకు ఆచ్ఛాదన మున్నదే ఇది దయ్యంలాగా మనలను తరిమి కొడుతున్నది. అందుకే పైపై అడ్లు ఎన్ని తొలగినా మన అసలైన స్వరూపం మనకిదమిత్థమని అనుభవానికి రావటం లేదు. ఇది ఎలాటి ఆచ్ఛాదన అంటే “రాహుగ్రస్త దివాకరేందు సదృశః" దివాకరేందు లంటే సూర్యచంద్రులు. వారు సహజంగా ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటారు. కాని అప్పుడప్పుడు వారికీ గ్రహణ దోషం పడుతుంటుంది. రాహువో కేతువో ఎవరో ఒకరు పట్టి పీడిస్తుంటారు.

Page 58