#


Index

  స్థూలం సూక్ష్మమంటే అర్థమవుతున్నది మనకు అన్నమయ మనీ మనోమమయ మనీ. మరి ఈ కారణ శరీరమంటున్నారే ఇదేమిటి. ఇలాటి దెక్కడా ఉన్నట్టు మనకు దాఖలా లేదే అని అడగవచ్చు. శరీరమనగానే కరచరణాద్యవయవాలని అభిప్రాయ పడతాము మనం. శరీరమంటే కరచరణాదులే ఉండనక్కరలేదు. అలాగైతే మనస్సును సూక్ష్మశరీరమని ఎలా అనగలిగాము. దానికి కరచరణాద్యవయవాలు లేవు గదా. కాబట్టి శరీరమంటే మన మనుకొనే అర్థం కాదు. నిరావరణమైన చైతన్యాన్ని ఆవరించి దాన్ని సంకుచితం చేసి చూపేదేదో అదంతా శరీరమే. అలాంటి పని స్థూల సూక్ష్మాలెలా చేస్తున్నాయో కారణం కూడా అలాగే చేస్తున్నది. ఏమిటీ కారణ శరీరం అంటారేమో మనసులోని వాసనలే Impressions కారణ శరీరం. ఇంగువ కట్టిన బట్ట లాంటిది మానవుడి మనస్సు. బహు జన్మల నుండీ మన మీ ప్రపంచంతో లావాదేవీ పెట్టుకొంటూ వచ్చాము. తన్నిమిత్తంగా మనలో ఈ ప్రాపంచికమైన వాసనలు బాగా పేరుకు పోయాయి.

  ఎంతగా పేరుకొన్నాయంటే ప్రపంచ దృశ్యాలు తొలగినా అవి తొలగిపోవు. తుదకు మనోవృత్తులు లయమైనా అవి లయం కావు. ప్రపంచం తోడి సంబంధం మనసులో వృత్తులు రేకెత్తిస్తే ఆ వృత్తులు బాగా ఆవృత్తమయి ఈ వాసన లేర్పడినాయి. అవి ఒకసారి ఏర్పడితే చాలు. ఇక ప్రపంచ సంసర్గం తొలగినా మనోవృత్తులు తొలగినా అవి తొలగిపోవు. నీటిలో వండులాగా అలాగే నిలిచి ఉంటాయి. నిలిచి ఉండి మరలా వృత్తులను రెచ్చగొడతాయి.

Page 57