6
మంచిదే కాని ఈ అనాత్మ ప్రపంచాన్ని ఉపసంహరించుకొనే ప్రయత్నం మనకు దేనికి దాని పాటికదే ఉపసంహృత మవుతూందిగదా సుషుప్త దశలో. జాగ్రత్స్వప్నాలలో ఐతే నేననీ - నేను చూచే ప్రపంచమనీ రెండు భావాలున్నాయి గాని సుషుప్తిలో అలాటి గొడవేలేదు గదా. అక్కడ బాహ్యమైన విశ్వమూ మనకు కనపడటం లేదు. అంతరమైన దేహేంద్రియాదులూ గోచరించటం లేదు. ఆఖరుకు మనో వృత్తులు కూడా లయమై పోయాయి. పోతే ఇక ఉన్నదేమిటప్పుడు. మన పాటికి మన మొకళ్లమే అంటే మీరు చెప్పే ఆత్మ తప్ప మరే పదార్థమూ లేదు. ఆలాంటప్పుడది ఉన్నట్టు మనకు భాసించాలి గదా. ఎందుకని భాసించటం లేదు. ఆత్మ అంటే చైతన్యమేనని గదా సిద్ధాంతం చేశారు. మరి చైతన్యమే అయినప్పుడు దానికి తానున్నాననే స్ఫురణ ఉండాలి గదా. ఎందుకు లేక పోయింది. అనాత్మతో పాటు ఆత్మ కూడా అస్తమిస్తున్నదే దీనికేమిటి జవాబని మరలా ఒక ఆక్షేపణ.
Page 56