#


Index

  దక్షిణామూర్తి అనేకాదు “ఆచార్యవాన్ పురుషోవేద. ఆచార్యాదైవ విదితా విద్యా సాధిష్ఠం ప్రాపతి" - అన్నట్టు లోకంలో ప్రతి ఒక్క గురుమూర్తీ దక్షిణామూర్తే గురుస్సాక్షాత్పరం బ్రహ్మ అన్నారు. బ్రహ్మ భూతుడైన గురువు వాక్యోపదేశం చేస్తే ఆ వాక్యార్థాన్ని శ్రవణం చేసి ధ్యానం చేసి సాధకుడైన శిష్యుడు కూడా బ్రహ్మ నిష్ఠుడై తరించవచ్చు. గురుముఖంగా సాధించిన విద్యే మానవుడికి సాయుజ్యాన్ని ప్రసాదిస్తుంది. సందేహం లేదు. ఇందులో గురువనేవాడు మనబోటి శిష్యుల కుపదేశించటమే అనుగ్రహం. పోతే అతడుపదేశించిన వాక్యార్థాన్ని భావన చేసి బ్రహ్మ జ్ఞానాన్ని గడించటం మనమంతా చేయవలసిన సాధన. మన ప్రయత్నం లేకుండా కేవలమాయన అనుగ్రహం ఫలితాన్ని అందివ్వదు. గుర్వనుగ్రహమూ శిష్యుడి సాధనా -రెండూ కలిసి ఉపసంహరిస్తే మాయాకల్పితమైన జీవుడి వ్యామోహ మెన్ని జన్మల సంచితమైనా ఒక చీకటి పొరలాగా పూర్తిగా విరిసిపోతుంది. తత్ఫలంగా సర్వాత్మ దర్శనం మనకు తక్షణమే లభిస్తుంది. అప్పటి నుంచీ ఇక ఎక్కడ చూచినా ఆత్మే ఎప్పుడు చూచినా ఆత్మే ఏది చూచినా ఆత్మే అనాత్మ ప్రపంచ మనే గంధం కూడా కానరాదు.










Page 55