#


Index

  ఒకడు దాని తొండం తడవి చూచి ఏనుగంటే ఏదో గాదు ఒక రోకలని భావించాడు. తోకతడవి ఒకడు బల్లెమని భావించాడు. చెవులు పట్టుకొని ఒకడు చేట అనుకొన్నాడు. కాళ్లు పట్టి ఒకడు స్తంభమనుకొన్నాడు. మరొకడు దాని కడుపు తడవి చూచి ఒక పెద్ద గాదే అని తలపోశాడట.

  ఇలా భావించారంటే వాళ్లు వారి భావాను గుణంగా అన్ని ఏనుగులున్నాయా అక్కడ ఉన్న దోకే ఏనుగు వాస్తవానికి. మరి ఇన్ని ఎలా వచ్చాయి. ఎక్కడ నుండి వచ్చాయి. అవన్నీ ఏనుగులు కావు. ఏనుగు అవయవాలు. అవయవాలు Parts చూచి అవయవి Whole అని అపోహ పడ్డారా గ్రుడ్డివాళ్లు. అన్ని అవయవాలూ కలిపి వ్యష్టిగా కాక సమష్టిగా చూడలేకపోయారు. సమష్టిగా చూస్తే వస్తువొకటిగానే కనిపించేది. అలా కాక దేని పాటికది వ్యష్టిగా చూడటం మూలాన అనేక రూపాలుగా భాసించిందది. అలాగే భాసిస్తున్నదిప్పుడా ఆత్మ పదార్థం మనకు. మనమంతా ఆత్మ విశేషాలనే చూస్తున్నాము గాని నిర్విశేషమైన ఆత్మను చూడటం లేదు. విశేషాలంటే ఏవో గావు. మన చుట్టూ కనిపించే ఈ నామరూపాలే. ఇవన్నీ దాని అవయవాలు. దాని రూపాలు Forms ఏనుగు అవయవాల లాంటివి కూడా కావివి. ఏనుగు సమష్టిగా ఎలా కనిపిస్తుందో తోక తొండమని ఎక్కడి కక్కడ వ్యష్టిగా కూడా అలాగే కనిపించ గలదు. పోతే ఇది అలాంటి వ్యవహారం కాదు. ఇక్కడ సమష్టి నిరాకారమైన చైతన్యం ఏనుగు లాగా సాకారం కాదు నిరాకారం గనుకనే అది ఆకారాలుగా మారి కనిపించే అవకాశం లేదు. అయినా కనిపిస్తున్నాయి మన కంటికి నామరూపాలు.

Page 52