#


Index

  పోతే ఇక అంధులూ జడులూ వీరి మాట చెప్పనక్కర లేదు. బాలురలాగా పిన్న వయసు వారు కాకున్నా నేత్రములు లేని వారికీ ప్రపంచమే లేదు. ఎంత సేపటికీ ఒకరు చెబితే విని ఓహో! అలాగా అని గ్రహించవలసిందే గాని తాము కండ్లతో చూచి స్వయంగా విషయాన్ని గ్రహించే శక్తి లేదు వారికి. కేవలం శ్రుత జ్ఞానం దృష్టి జ్ఞానమెలా కాగలదు. కాబట్టి వారిదీ అసమగ్రమే. అంతకన్నా అసమగ్రమైనది జడ బుద్ధుల జ్ఞానం. కళ్లే గాదు మనసు కూడా లేదు వారికి. మనసు పని చేయకపోతే అసలు కళ్ళున్నా ఉపయోగం లదు. “అన్యత్రమనాఃనాపశ్యమ్” అన్నట్టు మనసు పరధ్యానంగా ఉంటేనే విషయమర్థం గాదు మనకు. ఇక మనసు లేకనేపోతే చెప్పేదేముంది అంతా అయోమయమే.

  కాబట్టి ఇంతకూ చెప్పవచ్చేదేమంటే ఇలాటి అయోమయుల లాంటి వారీ శాస్త్ర కారులంతా కారణం వారి లాగానే వీరు కూడా భ్రాంతాః భ్రాంత చిత్తులు వస్తు వొక విధంగా ఉంటే దాన్ని మరొక విధంగా దర్శించటమే భ్రాంతి అంటే, వస్తు విక్ష ఏమిటి. అది ఎలా ఉంది వస్తువనేది ఆత్మ పదార్థం అది శుద్ధ చైతన్య రూపం. నిరాకారం, నిరాకారం గనుకనే ఆకాశం లాగా సర్వత్రా వ్యాపించి ఉంది. మరి నీవు ఇదంతా రూపం Objective గా ఏది చూస్తున్నావో ఆ యీ ప్రపంచం కూడా వాస్తవంలో అదే. దాని ప్రకాశం చేతనే ఇది ప్రకాశితమవుతూ ఉంది కాబట్టి దాని రూపమే ఇది. దాని రూపం గనుకనే దానికన్నా భిన్నంగా లేదు. బంగారం వివిధ రూపాలే గదా కటక కుండలాదులైన ఆభరణాలన్నీ.

Page 50