వీరూ అలాగే భావిస్తున్నారు. వీరికీ వారికీ ఇక తేడా ఏముంది. దొందూ దొందే అన్నట్టుంది వ్యవహారం. ఎవరికి గాని అసలు ఆత్మ అంటే ఏమిటో ఏమాత్రమూ అంతు పట్టటం లేదు. అంతుపట్టక తాము పట్టుకొన్నదే “అహమితి భ్రాంతాః” ఆత్మతత్త్వమని భ్రమపడు తున్నారు. తాము పడటమే కాక మేము పేర్కొన్నదే ఆత్మ ఇదే యదార్థం - నమ్మండి మీరు కూడా నని భృశం వాదినః పదిమందికీ చాటి చెబుతున్నారు. సమష్టి రూంపగా చూడవలసిన భావాన్ని వ్యష్టిరూపంగా Partial చూడటం వల్లనే ఇలాటి భ్రాంతి ఏర్పడింది వీరికందరికీ. జ్ఞానమెప్పుడూ సమగ్రం. అరగౌరగా కలిగితే అది జ్ఞానమే కాదు. సమగ్రమైన జ్ఞానానికి నోచుకోనంత వరకూ వీరసలు శాస్త్రజ్ఞులెలా అవుతారు. శాస్త్రజ్ఞులని మాటకే అర్హులు కారు.
కాకుంటే మరెవరంటారు వీరు. స్త్రీ బాలాంధజడోపమాః స్త్రీలూ బాలురూ అంధులూ జడులూ ఇలాంటి వారితో సమానులు. పురుషులు కంటే స్త్రీలు ప్రజ్ఞలో కొంత తక్కువ స్థాయికి చెందినవారు. కారణం వారి ప్రజ్ఞ గృహజీవన మాత్రానికే పరిమితమైన ప్రజ్ఞ. పురుషుల లాగా ఇంటా బయటా నాలుగు చోట్లా తిరిగి అటు లోక జ్ఞానమూ - ఇటు శాస్త్రజ్ఞానమూ - రెండూ గడించే అవకాశం లేదు వారికి. ఉన్నా వారి శరీర తత్త్వం అందుకు అనుకూలమైనది కాదు. అంచేత సాధారణంగా వారి ప్రజ్ఞ అసమగ్రమైనదే. పోతే అంతకన్నా అసమగ్రమైనది బాలురకున్న ప్రజ్ఞ. పురుషజాతిలో పుట్టినా వారికి వయసు లేదు. అనుభవం లేదు భవిష్యత్తులో అనుభవాన్ని గడించి పైకి రావలసిన వారు కాబట్టి ఇప్పట్లో వారి జ్ఞానమంతంత మాత్రమే.
Page 49