5
అదే ఉంది ఇవేవి లేవన్నారు. బాగానే ఉంది హేతు దృష్టాంతాలు కూడా చూపారు. సంతోషమే. కాని మీరెంత శాస్త్రీయంగా నిరూపించినా మన స్వానుభవంలో అలా మనకు భాసించటం లేదే. లోకుల అనుభవమే కాదు. ఎంతో ప్రజ్ఞావంతులని పేరు గాంచిన శాస్త్రజ్ఞుల అనుభవం చూచినా ఇందుకు భిన్నంగానే తోస్తున్నది. కేవల భౌతికవాదులైన చార్వాకుల మొదలు కేవల శూన్యవాదులైన మాధ్యమికుల వరకూ ఒక్కొక్క రొక్కొక్క మార్గం త్రొక్కుతూ వచ్చారు. ఒక రూహించింది ఒక రూహించటం లేదు. ఎవరి వాదం వారిదే.
చూడండి "దేహం ప్రాణ మపీం ద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుః” కొందరు ఈ కనిపించే దేహమే ఆత్మ అని భావిస్తున్నారు. వీరు దేహ చైతన్య వాదులు. ప్రాణమపి. కొందరు ప్రాణమే ఆత్మ అంటున్నారు. వీరు ప్రాణ చైతన్య వాదులు. ఇంద్రియాణ్యపి. మరికొందరు చక్షురాదులైన ఇంద్రియాలే ఆత్మ అని వాదిస్తున్నారు. వీరు ఇంద్రియ చైతన్యవాదులు. ఈ ముగ్గురూ చార్వాకుల లోనే మూడు తెగలు. వీరి దృష్టిలో చైతన్యమనేది ఆత్మకు సంబంధించింది కాదు. అది దేహేంద్రియాదుల గుణమే. పంచ భూతాలు పంచీకృతమై ఆయా పాళ్ళలో కలిసి దేహంగా పరిణమించినప్పుడు ఒకానొక శక్తి ఆ సంఘాతం System లో ఏర్పడుతుంది. అదే చైతన్యశక్తి. ఇది ఎలాంటి దంటే గుడ జలాది పదార్థాలు కొన్ని కలిపి క్వాధం వేస్తే ఆ క్వాథ రసపానం చేత మనలో ఒక మదశక్తి Intoxication ఎలా ఏర్పడుతుందో అలాటిది విడివిడిగా దేనిలోనూ లేదు శక్తి అన్నీ కలిస్తేనే ఉదయిస్తుంది. మళ్లా అవి విడిపోతే తొలగిపోతుంది.
Page 47