ఇందులో దానికనిపించినా అది జ్ఞానమే. నా కనిపించినా జ్ఞానమే. మొత్తం మీద జ్ఞానానికే అది గోచరమవుతుంది. జ్ఞానమే సాక్షి Witness లేదా ప్రమాణం Proof పదార్థానికి. “ప్రమాణాధీనా ప్రమేయ సిద్ధిః" అన్నారు శాస్త్రజ్ఞులు. ప్రమాణానికి గురి కాకుండా ప్రమేయ మనేది సిద్ధించదు. శరీరాదికమైన ఈ విషయ ప్రపంచమంతా మనకు ప్రమేయం Ob-ject of Knowledge అంటే తెలుసుకోబడుతూందని అర్థం తెలుసుకోబడుతూందంటే ఆ తెలుసుకొనే వస్తువేది. అదే జ్ఞానం లేదా చైతన్యం అది తెలుసుకొంటూంటేనే ఇది తెలుస్తుంది. తెలుస్తూంటేనే ఉందని కూడా అర్థమవుతూంది అప్పటి కస్తిత్వ Existance మంటే ప్రమేయత్వం Knowability ప్రమేయత్వమంటే ప్రమాణ గోచరత్వం. ప్రమాణమన్ని పదార్థాలకూ చైతన్యమేనని చెప్పాము. మరి ఈ చైతన్యానికేమిటి ప్రమాణమని వెతకక్కర లేదు. అది చైతన్యమే గనుక స్వతః ప్రమాణం Self Evident ప్రమాణం గనుకనే స్వతస్సిద్ధం Self Existant కూడా. ఘటం లాగా దీపం లాగా మరొక దాని మీద ఆధారపడ బనిలేదు.
ఎప్పుడైతే ఇలా స్వతస్సిద్ధమో అప్పుడదే సత్యమైన పదార్థం కాగా దాని నాశ్రయించి బ్రతుకుతున్న ఇవన్నీ ఇక అసత్యమే. ఎందుకంటే అది ఒకటి ఉంటేనే వీటి కస్తిత్వం లేకుంటే లేదు. ఒకటి ఉంటేనే ఒకటి ఉండి లేకుంటే ఎప్పుడు లేక పోతుందో అప్పుడా రెండవది ఈ మొదటి దానికంటే వేరు కానేరదు. అంటే దాని స్వరూపమేనని భావం. దీనికి సరియైన ఉదాహరణ మనకు సువర్ణమూ ఆభరణాలే. సువర్ణం లేకుంటే ఆభరణమనేది ఎక్కడుంది.
Page 45