#


Index

2

  అంతా ఆత్మ స్వరూపమే నన్నారు. బాగానే ఉంది కాని అది ఎప్పుడు సంభవం. ప్రపంచమనేది లేకుండా పోతే గదా. లేకుండా ఎక్కడ పోయిందది? బాహ్యంగా లేకపోయినా మనలో అంతర్గతంగా ఉండనే ఉంది. నిజాంతర్గత మని మీరే గదా వర్ణించారు. నిజాంతర్గత మంటూనే మరలా స్వాత్మానమేవ అద్వయమని ప్రతిపాది స్తున్నారు. అంతర్గత మయినప్పుడద్వయమెలా అయింది? అంతర్గత మంటే ఏమని అర్థం? లోపల ఉన్నదని గదా! ఒక పదార్థం లోపల ఉందని చెప్పినప్పుడది దేని లోపల ఉందో, అదే ఇది ఎలా కాగలదు? పెట్టెలోపల ఒక పుస్తకముందని చెబితే ఆ పెట్టె పుస్తకమవుతుందా? కాదు. అలాగే ప్రపంచమిప్పుడు నా చైతన్యం లోనే ఉందంటే అది నా స్వరూపమే కావటానికి లేదు. మరి అలాంటప్పుడద్వయమని ఎలా వాక్రుచ్చారని ప్రశ్న వస్తుంది.

  దీనికి సమాధానం చెబుతున్నారిప్పు డాచార్యుల వారు. "బీజస్యాంత రివాంకురః" అని ఒక విత్తనం లోపల దాని అంకుర మున్నట్టుందట ఈ ప్రపంచం మన ఆత్మలో. అంకురమంటే మొక్క, అది నీకు బయటికి వచ్చి కనిపిస్తున్నదంటే ఎక్కడ ఉందది అంతకు ముందు? ఆ విత్తనంలోనే గదా ఉండాలి.

Page 21