#


Index

  మాటలతోనా! కాదు మౌనంతో “మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్త్వం' బ్రహ్మతత్త్వాన్ని మౌనముద్రతో బోధి స్తున్నాడు. అదే కరకలిత చిన్ముద్ర తర్జని- అంగుష్ఠం - రెండింటి కలయికకు చిన్ముద్ర అని పేరు. అలాంటి జ్ఞానముద్రతో ఆయనగారు మౌనంగా బ్రహ్మతత్త్వాన్ని బోధిస్తుంటే బ్రహ్మనిష్ఠులై వారు శ్రవణం చేస్తున్నారట. జ్ఞానశక్త్యవతారుడైన అలాంటి దక్షిణామూర్తిని 'ఈడే’ త్రికరణ శుద్ధిగా నేను ముముక్షువునై సదా భజిస్తాను.

-1-

విశ్వం దర్పణ దృశ్య మాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్య న్నాత్మని మాయయా బహిరి వోద్భూతం యధా నిద్రయా య స్సాక్షా త్కురుతే ప్రబోధ సమయే స్వాత్మాన మే వాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే -

  విశ్వమంటే స్థావర జంగమాత్మకంగా వ్యాపించిన ఈ సమస్త ప్రపంచమూ నని అర్థం. ఇది మన వెలపలనే గాక లోపల కూడా నిండి నిబిడీకృతమై ఉంది. వెలపల వస్తు రూపంగా, లోపల భావ రూపంగా, రెండూ ప్రపంచమే. దీనిని గురంచే ప్రస్తుతం భగవత్పాదులు విచారణ సాగిస్తున్నారు. ఇది ఏమిటా- దీనికి పరిష్కారమేమిటా-అని, మానవుడు విచారించవలసినవీ, పరిష్కరించ వలసినవీ అసలు మూడే మూడు పదార్థాలు. ఒకటి మనకు కనిపించే ఈ భౌతికమైన ప్రపంచం. మరొకటి దీని కతీతంగా ఉన్నదని భావించే ఒక అ భౌతికమైన ఈశ్వరతత్వం. మూడవది ఈ రెండు కొసలతో సంబంధం పెట్టుకొని ఈ రెంటి మధ్యా చిక్కి సతమతమవుతున్న మన బోటి జీవులు.

Page 12