#


Index

ధ్యానమ్

  దక్షిణాభిముఖంగా వటవృక్షం కింద కూర్చున్న మూర్తి దక్షిణా మూర్తి సాక్షాత్తూ కైలాసవాసి అయిన పరమేశ్వరుడే. ‘ఆచార్యేంద్రం' - బ్రహ్మవిద్యను బోధించే ఆచార్య పురుషులందరికి మూల పురుషుడు. 'ముదితవదనం' బ్రహ్మ చైతన్యం తాండవిస్తున్నదా ముఖంలో. స్వాత్మారాముడు ఆనందమూర్తి తనలో తానే ఆనందిస్తూ ఏకమేవ అద్వితీయ మన్నట్లు భాసిస్తున్న మహానుభావుడు అలాంటి ఆది గురువే బోధిస్తున్నాడీ సాధక లోకానికి. సాధకులెవరోకాదు. 'వర్షిష్టాంతే వసదృషిగణైః' శతవృద్ధులైన అంతే వాసులు వసిష్ఠ వామదేవాదులైన మహర్షులు చుట్టూ పరివేష్టించి ఉన్నారు. వారు వృద్ధులైతే వారికుపదేశించే ఆ గురువు యువకులలో యువకుడు మరి ఆ ఉపదేశమెలాంటిది?

Page 11