“యతస్తదర్థే విజ్ఞాతే సమస్త పురుషార్థ సిద్ధిః అతస్తద్వివరణే యత్నః క్రియతే మయా” ఎంత దుర్విజ్ఞేయమైనా ఈ ఒక్క ఏడు వందల శ్లోకాల సారం గ్రహిస్తే చాలు సమస్త పురుషార్థాలూ, ఇందులోనే పొందుపడి ఉన్నాయని సెలవిచ్చారాయన. అలాగే ఈ పదిశ్లోకాల భావాన్నీ గ్రహించి అనుభవానికి తెచ్చుకొంటే చాలు జిజ్ఞాసువులు. సమస్త భావాలూ ఇందులోనే సమసి పోతాయని నా విశ్వాసం. అందుకే ఈ పునః పునర్వివరణోద్యోగ శంఖారావం. ఇది మనసులో పడి భ్రమరకీట న్యాయంగా మీ జీవభావం బ్రహ్మభావ మందగలిగితే నేనూ దీనినెప్పుడో అందుకొన్నాననే భావిస్తాను. ఇక సెలవు.
భగవత్పాద దాసాను దాసః
శ్రీనివాసః
ఆశాస్యమ్
భస్మవ్యాపాండురాంగ శ్శశి శకల ధరో
జ్ఞాన ముద్రాక్ష మాలా
వీణా పుస్తెర్వరాజత్కరకమల ధరో
యోగ పట్టాభిరామః వ్యాఖ్యాపీఠే నిషణో మునివరనికరై
సేవ్య మానః ప్రసన్నః
సవ్యాలః కృత్తివాసాః సతత మపతునో
దక్షిణామూర్తి రీశః
Page 10