#


Index

  అది ఆ చైతన్యాన్ని నిత్యమూ ఆశ్రయించినదే కాబట్టి ఎక్కడికీ పోదు. నిత్య గానే నిలిచి ఉంటుంది. ఇది ఈశ్వరుడి విషయంలో శక్తి అయితే సాధకుడైన జీవుడి విషయంలో బ్రహ్మాకార వృత్తి అని గ్రహించాలి మనం.

  పోతే 'జ్ఞాన ముద్రాక్షమాలా వీణాపుసైర్విరాజత్కర కమల ధరః' జ్ఞాన ముద్రేమిటి - అక్షమాలాదు లేమిటి. అవి నాలుగూ నాలుగు చేతులలో ధరించట మేమిటి జ్ఞానాన్ని ముద్రించింది లేదా ఆవరించింది. జ్ఞాన ముద్ర చైతన్యాన్ని ఆశ్రయించి ఉన్న పరాశక్తి అని అర్థం అదే అక్షమాల అయింది. పరాపశ్యంతి అయిందని అర్థం. పశ్యంతి అంటే ఆద్యంతాలను కలుపుకొని చూడటం. సృష్టికి అది చైతన్యం అంత మచేతనమైన జగత్తు. వీటి రెంటినీ భావించకుంటే ఏది ఏమి కావాలో తెలియదు. అలా భావించి చూడటమే పశ్యంతి. దానికి సంకేతమే అక్షమాల. ఆకారమాది క్షకార మంతం వర్ణ సమామ్నాయానికి అవి రెండూ కలిస్తే అక్షం అది ఆవృత్తి అయితే అక్షమాల మాటి మాటికీ పర పశ్యంతి అయి జగచ్చక్రాన్ని నడుపుతూంది కాబట్టి అక్షమాల పశ్యంతి అవుతున్నది. మరి వీణా దండమేమిటి అది శక్తి మూడవ దశ అయిన మధ్యమ. వీణ అంటే నాదం. నాదమంటే ప్రసరణం. పశ్యంతి ఒక సంకల్పమైతే ఆ సంకల్ప మంతకంతకూ సృష్టి కభిముఖంగా చేసే ప్రయాణం మధ్యమ. సృష్టికీ సంకల్పానికీ మధ్యవర్తిని కాబట్టి అది మధ్యమ దానికి చిహ్నమే వీణ

Page 104