#


Index

  అంటే మనకు ప్రయత్నమయిన దాయనకు లక్షణమూ ఆయనకు లక్షణమైనది మనకు ప్రయత్నమూ అంచేత ఈ రెండు విధాలా అర్థం చెప్పుకోవాలి మన మిందులో ప్రతి మాటకు. ఈ మొదటి మాటే చూడండి. పరిశుద్ధంగా వెలిగే చైతన్య మాయనకు లక్షణమైతే మనకది ప్రయత్నంతో సాధించమని హెచ్చరిక.

  పోతే 'శశి శకల ధరః' శశి శకల మంటే చంద్రకళ అది ధరించాడాయన చంద్రకళ ఏమిటి ధరించటమేమిటి. చంద్రుడంటే మనస్సు కళలంటే దాని వృత్తులు అవి నామాది ప్రాణాంతంగా పదిహేనని వర్ణించింది శాస్త్రం. బాహ్యమైన సృష్టి ఊడా ఈ పంచ దశ కళాత్మకమే. కాగా పదహారవ దొకటున్నది షోడశి. దానికే సాదాఖ్య అని పేరు. ఇవన్నీ అనిత్యమైతే అది నిత్య కళ. ధ్రువకళ నిత్యాషోడశికా అని దేవీ నామావళి అది ఏదో గాదా కళ. పారమేశ్వరమైన శక్తి ఆయన ప్రకాశ స్వరూపుడైతే అది విమర్శాత్మిక “పరాస్య శక్తిః స్వాభావికీ” అని శాస్త్రం. ఆయన శక్తే గనుక అది ఆయన గారికి స్వాభావికం నిత్య సిద్ధం ఆయన చైతన్యమూ. అది ఆయన శక్తీ. ఆ శక్తి చలించనంత వరకూ ధ్రువ నిత్య అదే షోడశి. చలిస్తే అధ్రువ అనిత్య. దీనికే వృత్తి అని పేరు. పంచ దశాత్మకమైన ఈ వృత్తి చక్రమే మనస్సు. దీని కధీనమయి నంతవరకూ అది జీవభావం అతీతమైతే అది ఈశ్వర భావం. ఎందుకంటే గతాః కలాః పంచ దశ ప్రతిష్ఠాః అన్నట్లు అక్కడ ఈ కళలన్నీ ప్రవిలయమై షోడశీ రూపిణి అయిన శక్తి మాత్రమే మిగులుతుంది.

Page 103