కాబట్టి దీని ద్వారా ఆ నిరాకారమైన తత్త్వాన్నే పట్టుకోవచ్చు మనం. అలా పట్టుకోమనే చెబుతున్నది మనకీ ఆకారం.
ఏదీ ఎలాగా అని అడిగితే మరలా మనవి చేస్తున్నాను. “భస్మ వ్యాపాండు రాంగః" కాముణ్ణి దగ్ధం చేశాడు పరమేశ్వరుడు. చేసి ఆ శవ భస్మం ఒడలంతా అలదుకొన్నాడట. నిజంగా చేశాడా అద్దుకొన్నాడా. కాముడంటే కామం. కామం దేనిమీద మానవుడికి అనాత్మ ప్రపంచం మీద ఇది ఆత్మ కాదని చూడటం వల్లనే దీని మీద కామ మేర్పడింది. ఎందుకు చూచా మాత్మ కాదని. అవిద్య వల్ల. బ్రహ్మ విద్యచేత మరలా ఆ అవిద్య తొలగిపోతే దానితోపాటు కామం కూడా తొలగి పోతుంది. అదే కామ దహనం దానితో అకాముడవుతాడు. మానవుడు. అకాముడైతే కర్మ కూడా నశిస్తుంది. కామం వల్లనే గదా కర్మ కామ కర్మలు రెండూ పోతే అది ఇక పరిశుద్ధమైన జ్ఞానమే. అదే భస్మ వ్యాపాండు రాంగత్వం. కామ కర్మలన్నీ ఆత్మ జ్ఞానాగ్నిలో భస్మమైతే దానితో పాండరమూ లేదా పరిశుభ్రంగా వెలిగిపోతుంది మన స్వరూం 'జ్యోతిషామపి తజ్ఞ్యోతిః'. అన్నట్టు నిత్మ నిర్మలమైన తత్త్వమది. ఇది సహజంగానే ఉండే లక్షణమా పరమాత్మకు ఎందుకంటే అది నిత్య ముక్తమైన చైతన్యం. పోతే మన జీవ చైతన్యమింకా ముక్తం కాలేదు. అయితే మనమూ అదే అవుతాము. ఆత్మ జ్ఞానంతో గాని అది లభించదు. అందుకోసమే ప్రయత్నించాలి మనం. ప్రయత్నించి అందుకొంటే మనకూ అది లక్షణ మవుతుంది. అంతవరకూ మనది ప్రయత్నమే.
Page 102